AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..

Meelo Evaru Kotishwarulu:  మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయమే.

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2021 | 11:40 AM

Share

Meelo Evaru Kotishwarulu:  మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయమే. హిందీలో అమితాబ్ హోస్ట్ గా ప్రసారమయ్యే.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్‌గా ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జెమినీ టీవీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

`ఎవరు మీలో కోటీశ్వరులు. మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు. త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి` అని జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం. గతంలో నాగార్జున, చిరంజీవి ఈ షోకి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా నిర్వహించబోతున్నారు. ఈ షోలో చిన్న చిన్న మార్పులతో ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై ప్రోమోని షూట్‌ చేశారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. త్వరలో కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే.. రెండో సారి ఎన్టీఆర్‌ టీవీ షోలో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆయన `బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్‌ భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకోబోతున్నాడట. ఇదిలా ఉంటే దాదాపు 120 దేశాల్లో ఈ షో విజయవంతం కావడం విశేషం. మొదటి మూడు సీజన్లకి నాగార్జున హోస్ట్ చేయగా, నాల్గో సీజన్‌కి చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఐదో సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్. శనివారం ఈ షో ప్రోమో విడుదల చేశారు. అలాగే ఈ షోకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. టీవీ9 లైవ్‏లో ప్రత్యే్క్షంగా వీక్షించండి.

Also Read:

Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‎లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..

Follow Us
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి