నిరుపేదలకు అండగా గుడ్‌నైబర్స్‌ ఆర్గనైజేషన్‌.. హరిజనవాడలో నిత్యావసర సరుకుల పంపిణీ

ఆపత్కాలంలో నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తంగా నిలుస్తుంది ఆ సంస్థ. అసలే కరోనా కాలం. పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి. సాధారణ దినాల్లోనే రెక్కాడితే కాని డొక్కాడని..

నిరుపేదలకు అండగా గుడ్‌నైబర్స్‌ ఆర్గనైజేషన్‌.. హరిజనవాడలో నిత్యావసర సరుకుల పంపిణీ
Nithyavasara Sarukulu Pampi
K Sammaiah

|

Mar 13, 2021 | 11:40 AM

ఆపత్కాలంలో నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తంగా నిలుస్తుంది ఆ సంస్థ. అసలే కరోనా కాలం. పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి. సాధారణ దినాల్లోనే రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వారివి. అలాంటిది కొంత కాలంగా పనులు లేక నానా ఇబ్బంది పడుతున్నారు ఆ హరిజన కుటుంబాలు. అటువంటి వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చింది గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్.

గుడ్‌నైబర్స్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవాదృక్పథం హర్శించదగ్గ విషయం అని వీరబల్లి మండలం తహసీల్దార్ బాలకృష్ణ పేర్కొన్నారు. కడప జిల్లా వీరబల్లి మండలం ఒదివీడు గ్రామం దుళ్ల హరిజనవాడలో గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ మేనేజర్ నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఆర్కే ఫౌండేషన్ బెంగళూరు వారి సౌజన్యంతో సుమారు యాబై కుటుంబాలకు తహసీల్దార్ బాలకృష్ణ చేతులమీదుగా 15 రకాల నిత్యావసర సరుకులను ఇంటిటికి పంపిణీ చేశారు.

దీనిని స్పూర్తిగా తీసుకోని మరింత మంది దాతలు ముందుకు వచ్చి గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ ద్వారా పేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి నాణ్యతతో కూడిన పదహైదు రకాల నిత్యావసర సరుకలను పంపిణి చేసిన గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ టీం కు తహసిల్దార్ బాలకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వీరబల్లి మండలంలోని వంద నిరుపేద కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు .అందులో బాగంగా దుళ్ళ హరిజనవాడలో యాబై కుటుంబాలకు తహసిల్దార్ బాలకృష్ణ గారి చేతులు మీదగా సరుకులను పంపిణి చేయడం జరిగిందన్నారు. మండలంలో కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉండే కుటుంబాలకు మా ఆర్గనైజేషన్ ద్వారా సరుకులను పంపిణి చేయాలనీ తహసిల్దార్ బాలకృష్ణ తెలియజేయడం జరిగిందన్నారు.

మా సంస్థ ద్వారా ఆర్కే ఫౌండేషన్ బెంగళూరు వారికీ ఆరువందల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణి చేయడానికి సహకరించాలని తెలియజేయడం జరిగిందని గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ మేనజర్ నాగేశ్వర రావు అన్నారు.

Read More:

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu