ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై మండిపడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ‘ బేషరం’ అంటూ నిప్పులు
ఉత్తరాఖండ్ సీఎం సీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మండిపడింది. మోకాళ్ళ వద్ద చిరుగులు ఉన్న జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించి ఈ కాలపు మహిళలు, యువతులు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాఖండ్ సీఎం సీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మండిపడింది. మోకాళ్ళ వద్ద చిరుగులు ఉన్న జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించి ఈ కాలపు మహిళలు, యువతులు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మన కల్చర్ కాదన్నారు. మన కుటుంబంలోని వారు దీన్ని చూసి ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మహువా మొయిత్రీ..ఆయనను సిగ్గులేని వ్యక్తి అని దుయ్యబట్టారు. ‘ మిమ్మల్ని ఏ విధంగా చూసినా ఏ మాత్రం సిగ్గులేని వ్యక్తిగానే కనిపిస్తారు’ అని ఆమె ట్వీట్ చేశారు. అసలు ఇదా మీ సంస్కృతి అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నారు కానీ మీ మెదడు మాత్రం చాలా నీచంగా కనిపిస్తోంది అని కూడా మహువా పేర్కొన్నారు. ఇక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కూడా తీరత్ కామెంట్స్ ని ఖండించారు.ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఆలోచించి మాట్లాడాలని, ఈ రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడేముందు అసలు ఇది సముచితమా కాదా అని నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు. బట్టలకు సంబంధించి ఏది సంస్కృతి, ఏది కాదు అన్నది సమీక్షించుకోవాలన్నారు. ఇది బ్యాడ్ మైండ్ సెట్ అని, మహిళలపై నేరాలను ప్రేరేపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ ప్రీతమ్ సింగ్ కూడా తీరత్ కామెంట్స్ ని షేమ్ ఫుల్ అని తీవ్రంగా ఖండించారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ఆయన తన కామెంట్స్ ని సరిదిద్దుకోవాలని, ఇకపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ప్రీతమ్ సింగ్ కోరారు. ఈ పార్టీ అధికార ప్రతినిధి గరిమా దాసౌనీ సైతం ఇదేవిధంగా స్పందించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Tirumala Brahmotsavam : బ్రహ్మత్సవాల్లో ఉపయోగించే పల్లకిని ఏ రాజు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా.. అది దేనితో తయారైందంటే..!