AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించిన కార్మిక సంఘాలు.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్న యూనియన్లు

ఉక్కునగరం విశాఖ రగిలిపోతుంది. స్టీల్‌ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో కార్మికుల నిరసనలతో విశాఖ

జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించిన కార్మిక సంఘాలు.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్న యూనియన్లు
K Sammaiah
|

Updated on: Mar 09, 2021 | 1:04 PM

Share

ఉక్కునగరం విశాఖ రగిలిపోతుంది. స్టీల్‌ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో కార్మికుల నిరసనలతో విశాఖ అట్టుడుకుతుంది. ఇంతకాలం శాంతియుతంగా ఉద్యమించిన కార్మికులు.. తాజా ప్రకటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో అవసరమైనప్పుడల్లా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలుపడంతో రాష్ట్రంలోని వైసీపీ సర్కార్‌ కార్మికుల ముందు దోషిగా నిల్చుంది. ఈ నేపథ్యంలో కార్మికులు భవిష్యత్‌ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడుపుఠాని బయటపడడంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జగన్, మోదీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మెస్తున్నామన్న ప్రటకన తర్వాత ఉక్కు కర్మాగారం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగాయి. కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అధికారులకు నిరసన తెగ తగిలింది. ఎక్కడికక్కడ అధికారుల కార్లను అడ్డగించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఊరుకునేదిలేదని, ఎంతవరకైనా వెళతామని, ప్రాణాలు సయితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆందోళనకారులు స్పష్టం చేశారు.

అయితే కేంద్రం తాజా వివరణతో ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నది రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం కేంద్రాన్ని ఒప్పించగలం అనే ధీమాతో కనిపించింది. ఇటు జనసేన సైతం కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని ఆశపడింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఆ రెండు పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.

ముఖ్యంగా జీవీఎంసీ ఎన్నికలను కార్మికులు బహిష్కరించడంతో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అన్నది ఆ రెండు పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రోజుకో రూపంలో కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా సంఘీభావం ప్రకటించారు కూడా. భవిష్యత్తులో ఉధ్యమం మరింత ఉధృం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయినా కేంద్రం మాత్రం వాటన్నింటినీ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.

కార్మిక సంఘాలు సైతం ఉద్యామన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఏపీలో ఆందోళనలకు పరిమితం కాకుండా.. జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తేనే కాస్త ఫలితం ఉంటుందని కార్మిక సంఘాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటన నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు సమావేశమై.. ఉద్యమ కార్యచరణపై వ్యూహం రూపొందించే అవకాశం ఉంది.

Read More:

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలంటే అదొక్కటే మార్గం.. కార్మికులను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్న గంటా

జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌.. బీజేపీపైకి ఎమ్మెల్సీ కవిత వదిలిన బాణం.. మల్లును ముల్లుతోనే తీసే యత్నం