జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌.. బీజేపీపైకి ఎమ్మెల్సీ కవిత వదిలిన బాణం.. మల్లును ముల్లుతోనే తీసే యత్నం

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొండగట్టు అంజన్నను కవిత తరచూ దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంజన్న సాక్షిగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా..

జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌.. బీజేపీపైకి ఎమ్మెల్సీ కవిత వదిలిన బాణం.. మల్లును ముల్లుతోనే తీసే యత్నం
Follow us

|

Updated on: Mar 09, 2021 | 11:49 AM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ గుణపాఠంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుంది. రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేసేందుకు ప్రచారంలో దూసుకెళుతుంది. మరోవైపు అధికార పార్టీకి బీజేపీ సవాల్‌ విసురుతుంది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా కమలనాథులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బీజేపీకి పోటీగా ఓ సరికొత్త నినాదం ఎత్తుకున్నారు.

తెలంగాణలో ముల్లును ముల్లతోనే తీయాలనేది నానుడి. జై శ్రీరామ్‌ నినాదంతో హిందూ ఓట్లకు గాలం వేస్తున్న బీజేపీకి పోటీగా ఎమ్మెల్సీ కవతి జై హనుమాన్‌ నినాదం ఎత్తుకున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా జగిత్యాల కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రామకోటి స్థూపం నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసిభూమిపూజ చేశారు. ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఐకేరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌కు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయ ఉత్తర ద్వారం ఎదుట రూ.90లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్థూపానికి మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్, సంజయ్‌కుమార్‌ భూమిపూజ చేశారు. వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొండగట్టు అంజన్నను కవిత తరచూ దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంజన్న సాక్షిగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతామని కవిత వెల్లడించారు. రానున్న రోజుల్లో చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నినాదం జై శ్రీరామ్‌కు పోటీగా కవిత శ్రీరామ భక్తుడైన హనుమాన్ ని అస్త్రంగా పెట్టారనే చర్చ సాగుతుంది. జై హనుమాన్ నినాదంతోనే బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే వ్యూహం రూపొందించినట్లు రాజకీయవ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హిందుత్వ నినాదంతో దూసుకెళుతున్నారు. అదే నినాదం దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయానికి కారణమైంది. జీహెచ్ఎంసీలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చింది బీజేపీ. టీఆర్ఎస్ హిందూ మతానికి వ్యతిరేకమని, ఎంఐఎంకు కొమ్ము కాస్తుందంటూ చేస్తున్న బండి సంజయ్‌ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది.

కొండగట్టు అంజన్న దేవాలయాన్ని యాద్రాద్రి తరహాలో మారుస్తామని దీనికి సంబంధించిన అన్ని విషయాలు సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని కవిత చెప్పారు. అంజన్న దేవాలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని చెప్పి 15 రోజులు కాకుండానే దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు కు చేరుకొని రామకోటి స్తూపానికి శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా ఒక్కసారి కూడా అంజన్న దేవాలయాన్ని దర్శించుకోని కవిత 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

Read More:

ఏప్రిల్‌ 1న గో మహాగర్జన.. కామారెడ్డికి చేరుకున్న యుగతులసి ఫౌండేషన్‌ ప్రచార రథం..