AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ టిలికాన్ఫరెన్స్‌.. కరోనా నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం

తెలంగాణలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీంఎ కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి జిహెచ్ఎంసి పరిధి లోని..

జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ టిలికాన్ఫరెన్స్‌.. కరోనా నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం
Cs Somesh Kumar
K Sammaiah
|

Updated on: May 02, 2021 | 8:27 PM

Share

తెలంగాణలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీంఎ కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి జిహెచ్ఎంసి పరిధి లోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులను చర్చించి, కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలో అవుట్-పేషెంట్ క్లినిక్స్ ప్రారంభించాలని డిప్యూటీ కమిషనర్లను సీఎస్‌ ఆదేశించారు. రోగలక్షణములు ఉన్న వ్యక్తులందరికీ “Home Treatment Kits” అందజేయాలని ఆదేశించారు. మున్సిపల్ స్టాఫ్, ఏ ఎన్ ఎం, ఇద్దరు ఆశా వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేసి, జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి ఈ బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని సందర్శించాలని ఆదేశించారు.

కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వ్యక్తులకు మెడిసిన్ కిట్లను అందజేసి, వాటిని తీసుకునేలా రోగలక్షణ వ్యక్తులకు సలహా ఇవ్వాలని సూచించారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో “Cleanliness Drive” చేపట్టాలన్నారు. ఆసుపత్రిలలో పరిశుభ్రత, ఆసుపత్రి ప్రాంగణాల్లో వెలుతురు పెంచుట, వైట్ వాషింగ్ మొదలైన పనులపై కూడా దృష్టి సారించాలని సీఎస్‌ ఆదేశించారు.

నగరంలోని అన్ని సర్కిల్లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More:

భవిష్యత్తులో ఇక పోటీ చేయను.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అసాధారణ నిర్ణయం

నాగార్జునసాగర్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా.. కోవిడ్‌ తగ్గిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామన్న విద్యా మంత్రి