భవిష్యత్తులో ఇక పోటీ చేయను.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అసాధారణ నిర్ణయం

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పరాజయం పాలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ లో నాకు పోటీ ..

భవిష్యత్తులో ఇక పోటీ చేయను.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అసాధారణ నిర్ణయం
Janareddy
Follow us
K Sammaiah

|

Updated on: May 02, 2021 | 7:06 PM

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పరాజయం పాలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ లో నాకు మళ్ళీ పోటీ చేయాలని లేదు, అవసరం కూడా లేదని జానారెడ్డి ప్రకటించారు. వయసు దృష్ట్యా నేను ఇంకా పోటీ చేయదలుచుకోవట్లేదని జానారెడ్డి అన్నారు. దీంతో సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జానారెడ్డి అస్త్ర సన్యాసం చేసినట్లైంది.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా శ్రమించారు. అలుపెరుగుండా చివరి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తనను సులభంగా గెలిపిస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి పార్టీ సీనియర్‌ నేతల ప్రచారం కూడా కలిసిరాలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోమలు భగత్‌ చేతిలో ఓటమి చెందారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జానారెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతన్నట్లు ప్రకటించారు.

కుందూరు జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ సమీపంలోని అనుముల గ్రామంలో 1946 జూన్ 20న జన్మించారు. 2004-09 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిగా పనిచేసారు. ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో పూర్వపు చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

అదే నియోజకవర్గం నుండి ఏడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, కొలతలు, తూనికలు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సదుపాయం, శుభ్రత మొదలైన వివిధ మంత్రిత్వ శాఖలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును జానారెడ్డి తిరగరాశారు.

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఉప ఎన్నికల ఫలితలు లెక్కించారు. నోముల భ‌గ‌త్ ప్ర‌తి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం క‌న‌బ‌రిచారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మ‌ళ్లీ మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. కారు వేగానికి హ‌స్తం, క‌మ‌లం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18449 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం అయ్యారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు నోముల భగత్‌ మీద తన గెలుపు ఖాయమని భావించిన జానారెడ్డికి కోలుకోలేని షాక్‌ తగిలింది. ఈ నేపథ్యంలో జానారెడ్డి తీసుకున్న అసాధారణ నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read More:

నాగార్జునసాగర్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం

జియోలో అద్భుతమైన ప్లాన్స్‌.. డేటాతోపాటు ఓటీటీ సదుపాయాలు!
జియోలో అద్భుతమైన ప్లాన్స్‌.. డేటాతోపాటు ఓటీటీ సదుపాయాలు!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
ప్రభుత్వ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!
ప్రభుత్వ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!
బిర్యానీలో దర్శనమిచ్చిన సగం కాలిన సిగరేట్!
బిర్యానీలో దర్శనమిచ్చిన సగం కాలిన సిగరేట్!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
మీరు స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఈ సెట్టింగ్‌తో చెక్‌
మీరు స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఈ సెట్టింగ్‌తో చెక్‌
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
ఉద్ధవ్ ఠాక్రే.. కొంప ముంచింది అదేనా..?
ఉద్ధవ్ ఠాక్రే.. కొంప ముంచింది అదేనా..?
ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం.. ఈ యోగాసనాలు రోజూ ట్రై చేయండి
ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం.. ఈ యోగాసనాలు రోజూ ట్రై చేయండి
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్