B Tech Ravi: కడప ఎస్పీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. వారిపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
పులివెందుల నియోజకవర్గంలో తమ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు.
TDP MLC B Tech Ravi : పులివెందుల నియోజకవర్గంలో తమ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పోటీలో నిలబడ్డారనే కోపంతో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఈ వేధింపులు మొదలైనట్లు కంఫ్లైంట్‌లో పేర్కొన్నారు.
టీడీపీ పంచాయతీ అభ్యర్థులను అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం, వాళ్ళ చీని పంటని ద్వసం చేయడం లాంటి చర్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి టీడీపీ మద్దతిదారులని ఎన్నికల్లో నిలబడటానికి ఒత్తిడి చేయలేదని.. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు సహకరిస్తామని భరోసా ఇచ్చినట్లు బీటెక్ రవి చెప్పారు. ఈ క్రమంలో నామినేషన్ వేసివవారిని.. వెనక్కి తీసుకోవాలని ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని.. నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగాయని, సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా అన్నీ ఏకగ్రీవాలు కావాలని బలవంతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏకగ్రీవాలపై పెట్టే దృష్టి…అభివృద్ధిపై ఎందుకు సారించడం లేదని బీటెక్ రవి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ప్రజలే వారికే పట్టం కడతారు కదా అని విమర్శించారు.
Also Read:
ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. ఆ కూలీ ఖాతాలో అక్షరాలా కోటి రూపాయలు
రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..