Today Gold Rates (15022021): రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..
ఫిబ్రవరి నెలలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మంచి జోరుమీదున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల పతనం కొనసాగుతుంది.
Today Gold Rates (15022021): ఫిబ్రవరి నెలలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మంచి జోరుమీదున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల పతనం కొనసాగుతుంది.
విజయవాడ, హైదరాబాద్లలో బంగారం ధర తాజాగా రూ.310 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.48,290 అయింది. 22 క్యారెట్ల బంగారం ధక కూడా రూ.310 తగ్గడంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.44,250కి వచ్చింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రూ.340 మేర రేటు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.50,620కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.300 మేర తగ్గడంతో ధర రూ.46,400కు దిగొచ్చింది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే…
ఒక వైపు బంగారం ధరలు పతనమవుతూ ఉంటే.. వెండి ధరలు మాత్రం ఎగబాకుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,200కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వెండి ధర రూ.600 మేర ఎగబాకింది. దీంతో 1 కేజీ వెండి రేటు రూ.73,900కి చేరింది.
Also Read: