General Insurance Companies : ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం చేయూత.. ఏ ఏ కంపెనీలకు ఎంత కేటాయించిందంటే..
General Insurance Companies: ప్రభుత్వ ఆధీనంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఆర్థిక మంత్రిత్వ
General Insurance Companies: ప్రభుత్వ ఆధీనంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత త్రైమాసికంలో రూ. 3,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఎల్‌సీఎల్), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీఎల్) మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు మూలధన సాయాన్ని అందించే ప్రతిపాదనను గతేడాది కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎన్ఐసీఎల్కు రూ. 7,500 కోట్లు, యూఐఐసీఎల్, ఓఎల్‌సీఎల్‌లకు రూ. 5 వేల కోట్ల చొప్పున మూలధనాన్ని పెంచాలని గతేడాది కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల అనంతరం అనుబంధ డిమాండ్‌లను ఆమోదించిన తర్వాత నిధుల సాయం చేయనున్నట్టు తెలుస్తోంది.