India vs England: విజయానికి ఏడు వికెట్ల చేరువలో భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమ్ ఇండియా ..

India vs England: ఇంగ్లండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్లి సేన,

India vs England: విజయానికి ఏడు వికెట్ల చేరువలో భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమ్ ఇండియా ..
Follow us
uppula Raju

|

Updated on: Feb 15, 2021 | 5:37 PM

India vs England: ఇంగ్లండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్లి సేన, పర్యాటక జట్టు కంటే 481 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌‌ బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలినా అశ్విన్‌ సెంచరీ(106), కెప్టెన్‌ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత జట్టు.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే 482 పరుగుల లక్ష్య సాధనతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ముచ్చటగా మూడు వికెట్లు తీసి విజయానికి చేరువ చేశారు. 8 ఓవర్లో అక్సర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఓపెనర్ సిబ్లీ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 16 ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కి యత్నించిన బర్న్స్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లీచ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఔటయ్యాడు. రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 50 పరుగులకు మూడు వికెట్లు చేజార్చుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రూట్ 2, లారెన్స్ 19 పరుగులతో నిలిచారు. అక్షర్ పటేల్ 2, అశ్విన్ 1 వికెట్ సాధించారు. విజయానికి భారత్ 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 429 పరుగులు చేయాల్పి ఉంది. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

India vs England 2nd Test: రెండో ఇన్నింగ్స్‌లో ముగిసిన భారత్ పోరాటం.. 286 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 482 పరుగులు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే