West Bengal Elections: వారి ముఖాలు చూడాలనుకుంటే కంట్రోల్‌లో పెట్టుకోండి.. టీఎంసీకి బీజేపీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..
West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతన్నాయి.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతన్నాయి. సై అంటే సై అంటూ ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము చట్టాలకు లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేస్తామని, అయితే దానిని చేతగానితనంగా భావించొద్దన్నారు. తాజాగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన ఓ ర్యాలీలో దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించిన ప్రసంగించిన ఆయన.. టీఎంసీపై విరుచుకుపడ్డారు.
‘‘మా ఆట ముగిసిందని ప్రత్యర్థి పార్టీ నేతలు అంటున్నారు. కానీ మా ఆట ఇప్పుడే మొదలైంది. సిద్ధంగా ఉండండి. ఎన్నికల తరువాత వారి ముఖాలను చూడాలనుకుంటే మాత్రం సంబధితుల తల్లులు తమ పిల్లలను అదుపులోకి ఉంచుకోమని చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తున్నాము. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు నడుస్తున్నాం. అంతమాత్రాన తామేమీ బలహీనులం కాదు.’’ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిలీప్ ఘోష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో కూడా దిలీప్ ఘోష్ ఇలాంటి తీవ్రమైన హెచ్చరికలే చేశారు. ‘మాపై ఎంత దాడి చేస్తున్నా భరిస్తున్నాం. కానీ మా పార్టీ కార్యకర్తలు సైతం చేతులు, కాళ్లకు పని చెబితే.. టీఎంసీ మద్ధతుదారులకు అయ్యే గాయాలకు పట్టీలు కూడా సరిపోవు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ANI Tweet:
Opposition is telling us that our game is over but let me tell them that our game is on. Be ready. Tell mothers to keep their children under control if they want to see their faces after polls. We’re civilised & follow law but it doesn’t mean that we’re weak: Dilip Ghosh (14.02)
— ANI (@ANI) February 15, 2021
Also read: