AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd Test: హాఫ్‌ సెంచరీలు పూర్తిచేసుకున్న కోహ్లీ, అశ్వీన్‌.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న..

Ind vs Eng Live: చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆటలో భారత్‌ మొదట్లో తడబడినా కోహ్లీ, అశ్వీన్‌ల రాకతో మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడగా ఆడుతూ...

IND vs ENG 2nd Test: హాఫ్‌ సెంచరీలు పూర్తిచేసుకున్న కోహ్లీ, అశ్వీన్‌.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న..
Narender Vaitla
|

Updated on: Feb 15, 2021 | 1:31 PM

Share

Ind vs Eng Live: చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆటలో భారత్‌ మొదట్లో తడబడినా కోహ్లీ, అశ్వీన్‌ల రాకతో మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడగా ఆడుతూ ఈ ఇద్దరు ప్లేయర్స్‌ టీమిండియా ఆధిక్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ కోహ్లీ, అశ్విన్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సమర్థవంతంగా ఆడుతూ చాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోర్‌ను నెమ్మదిగా పెంచుతున్నారు. ప్రస్తుతం 64 ఓవర్లకు భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. క్రీజ్‌లో కోహ్లి (62), అశ్విన్‌ (55) పరుగులతో కొనసాగుతున్నారు.

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అశ్విన్‌..

తన అద్భుత హాచ్‌ సెంచరీతో జట్టు స్కోర్‌ పరుగుపెట్టించడంతో పాటు మరో అరుదైన రికార్డును సైతం చేసుకున్నాడు టీమిండియా ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీయడంతో పాటు హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాళ్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఇయోన్‌ బోథమ్‌ 11 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇతనితోపాటు షకీల్‌ హల్‌ హసన్‌ తొమ్మిది సార్లు, హాడ్లీ, అశ్విన్‌ ఈ ఘనతను ఆరుసార్లు సాధించారు. ఇక భారత్‌ తరఫున గతంలో కపిల్‌ దేవ్‌, జడేజా నాలుగేసి సార్లు ఈ ఘనతను అందుకున్నారు.

Also Read: India vs England: సౌండ్ సరిపోవట్లేదు.. ఇంకా పెంచండెహే.. తెగ వైరల్ అవుతున్న కోహ్లీ ‘విజిల్’ వీడియో..