India vs England: సౌండ్ సరిపోవట్లేదు.. ఇంకా పెంచండెహే.. తెగ వైరల్ అవుతున్న కోహ్లీ ‘విజిల్’ వీడియో..
India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ మాంచి హుషారుమీదున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్‌లో 329 పరుగులతో..
India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ మాంచి హుషారుమీదున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్‌లో 329 పరుగులతో టీమిండియా రాణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే, ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో స్టేడియంలోని ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈలలు, కేరింతలు చేశారు.
ఆ సందర్భంగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాంచి హుషారుగా కనిపించాడు. తాను కూడా గట్టిగా ‘విజిల్’ వేసిన కోహ్లీ.. ఈ సౌండ్ పరిపోవట్లేదు.. ఇంకా పెంచండెహే అన్నట్లుగా సైగలు చేశాడు. ఈ సంజ్ఞలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కోహ్లీ హవభావాలు చూసిన నెటిజన్లు సైతం ‘ఓ’ ఏసుకుంటున్నారు.
BCCI Tweet:
When in Chennai, you #WhistlePodu! ??#TeamIndia skipper @imVkohli egging the Chepauk crowd on & they do not disappoint. ?? @Paytm #INDvENG
Follow the match ? https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/JR6BfvRqtZ
— BCCI (@BCCI) February 14, 2021
Also read:
ప్రేమ జంటలు ఒక్కటయ్యే ఆలయం.. తెలంగాణలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ సదనందాలయం