Police Case File: హైదరాబాద్‌లో దారుణం.. తెలిసిన అమ్మాయే కదా దగ్గరికి తీస్తే.. ఉన్నదంతా ఊడ్చుకెళ్లింది..
Police Case File: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నయా మోసం వెలుగుచూసింది. తెలిసిన వ్యక్తే కదా అని చేరదీస్తే.. అందినకాడికి..
Police Case File: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నయా మోసం వెలుగుచూసింది. తెలిసిన వ్యక్తే కదా అని చేరదీస్తే.. అందినకాడికి దోచుకెళ్లి తనను నమ్మిన వారికి షాక్ ఇచ్చింది ఓ నర్స్. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని మందమల్లమ్మ ఏరియాలో అనూష అనే మహిళ నర్సుగా పని చేస్తోంది. ఇక మీర్‌పేట్ పరిధిలోని లలితానగర్‌లో కస్తూరి, లక్ష్మణ్ అనే వృద్ధ దంపతులు నివాసముండే వారు. అయితే, ఆ వృద్ధ దంపతులను టార్గెట్ చేసుకున్న అనూష వారితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో వారి ఆస్తులపై కన్నేసిన అనూష.. వారికి నిత్యం మాయమాటలు చెప్పి నమ్మించేది.
ఈ క్రమంలో ఓ రోజు మత్తుమందు కలిపిన పాయసాన్ని ఆ దంపతులకు ఇచ్చింది. అయితే అది పనిచేయకపోవడంతో తాజాగా కరోనా వ్యాక్సిన్ పేరుతో కొత్త నాటకం ఆడింది. అసలే కరోనా టైమ్ అని, వ్యాక్సిన్ వేసుకుంటే టెన్షన్ ఉండదంటూ వారిని నమ్మబలికింది. తెలిసిన అమ్మాయే కదా? అని వృద్ధులు ఇంజక్షన్ వేసుకునేందుకు అంగీకరించారు. వచ్చిన ఛాన్స్‌ని అందిపుచ్చుకున్న సదరు మహిళ.. వారికి ఇంజక్షన్ వేసింది. అయితే, ఇంజక్షన్ వేసిన కాసేపటికే ఆ వృద్ధులు మత్తులోకి జారిపోయారు. ఇంకేముందు తన ప్లాన్ సక్సస్ అయ్యిందని భావించిన అనూష.. వారి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారాన్ని దోచుకెళ్లింది. అయితే, మత్తు నుంచి తేరుకున్న వృద్ధ దంపులు జరిగిన దోపిడీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మోసానికి పాల్పడిన అనూషనుు అదుపులోకి తీసుకున్నారు.
Also read: