Ind vs Eng: మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో కొనసాగుతోన్న టీమిండియా వికెట్ల పతనం… ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌.

| Edited By: Narender Vaitla

Updated on: Feb 15, 2021 | 10:56 AM

Ind vs Eng Live:చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు టీమిండియా..

Ind vs Eng: మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో కొనసాగుతోన్న టీమిండియా వికెట్ల పతనం... ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌.
india vs england 2nd test day 2 live score

India vs England 2nd Test Day 2 Live Score: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ నిలకడగా మ్యాచ్ ప్రారంభించింది. 1.2 ఓవర్ల వద్ద భారత్ గిల్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమాయానికి 18 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 54 పరుగుుల చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో పుజారా ( 7), రోహిత్ (25) ఉన్నారు. ఇక మూడో రోజు ఆటను భారత బ్యాట్స్ మెన్ ప్రారంభించారు

భారత జట్టు(ఫైనల్ ఎలెవన్): రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు(ఫైనల్ ఎలెవన్): సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Feb 2021 10:27 AM (IST)

    కొనసాగుతోన్నవికెట్ల పతనం.. ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌..

    మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత వికెట్ల పతనం కొనసాగుతోంది. ఇప్పటికే పుజారా, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌ అవుట్‌ కాగా. తాజాగా అజింకా రహానే పెవిలీయన్‌ బాట పట్టాడు. 30.3 ఓవర్‌ వద్ద రహానే అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 31.4 వద్ద 92/5 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 10:06 AM (IST)

    వరుసగా వికెట్లు కోల్పోతున్న భారత్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..

    భారీ ఆధిక్యంతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండాయకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. మ్యాచ్‌ ప్రారంభించిన కాసేపటికే పుజారా, రోహిత్‌ శర్మ పెవిలియన్‌ బాట పట్టగా తాజాగా రిషబ్‌ పంత్‌ కూడా అవుట్‌ అయ్యాడు. 25.3 ఓవర్‌ వద్ద జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌ చేతిలో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 26.4 ఓవర్ల వద్ద 69/4 కొనసాగుతోంది.

  • 15 Feb 2021 09:48 AM (IST)

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ శర్మ అవుట్‌..

    మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన కాసేపటికే భారత బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌ బాట పడుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభం కాగానే పుజారా రన్‌ అవుట్‌ కాగా.. 21.1 ఓవర్‌ వద్ద రోహిత్‌ శర్మ (26) స్టంప్ అవుటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 58/3 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 09:41 AM (IST)

    మూడో రోజు మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌.. ఆదిలోనే వికెట్‌ కోల్పోయిన భారత్‌..

    భారీ ఆధిక్యంతో మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 19 ఓవర్ల వద్ద పూజారా కేవలం ఏడు పరుగుల స్వల్ప స్కోర్కే రన్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్‌ శర్మ (26), విరాట్‌ కోహ్లి (0) ఉన్నారు.

  • 14 Feb 2021 04:37 PM (IST)

    రెండో రోజు ఆట పూర్తి.. 249 ఆధిక్యంలో భారత్..

    చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆదివారం భారత జట్టు మంచి ప్రతిభను కనబరిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 54 పరుగుుల చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో పుజారా ( 7), రోహిత్ (25) ఉన్నారు.

  • 14 Feb 2021 04:27 PM (IST)

    50 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా...

    గిల్ అవుట్ తర్వాత భారతబ్యాట్స్‌మెట్ నిలకడగా మ్యాచ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 17 ఓవర్ల సమయానికి 53/1 పరుగుల వద్ద ఉంది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (27), పుజారా (7) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 14 Feb 2021 04:07 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 14 పరుగులకు గిల్ అవుట్..

    11.2 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. జాక్‌లీచ్ విసిరిన బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే గిల్ రివ్యూకి వెళ్లినప్పటికీ అవుట్ అని తేలింది. ప్రస్తుతం భారత స్కోర్ ఒక వికెట్ నష్టానికి 46 పరుగుల వద్ద ఉంది. ఇక క్రీజ్‌లో రోహిత్ (21), పుజారా (3) ఉన్నారు.

  • 14 Feb 2021 04:03 PM (IST)

    అరే... కాస్తలో అవుట్ అయ్యేవాడే.. స్టంప్ నుంచి తప్పించుకున్న రోహిత్..

    రోహిత్ శర్మ 20 పరుగుల వద్ద ఉన్న సమయంలో లైఫ్ పొందాడు. స్టంప్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. యొయిన్ అలి వేసిన బంతిని భారీ షార్ట్ కొట్టడానికి ముందుకొచ్చిన రోహిత్ బాల్‌ను మిస్ చేశాడు. దీంతో వికెట్ కీపర్ ఫోక్స్ సక్సెస్ కాకపోవడంతో రోహిత్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు.

  • 14 Feb 2021 03:58 PM (IST)

    ఇంగ్లండ్-ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్‌పై స్పందించిన మోదీ..

    చెన్నై వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం చెన్నైలో పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెళ్లి మోదీ.. విమానంలో వెళుతోన్న సమయంలో తీసిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చెపాక్ స్టేడియంపై నుంచి వెళుతుండగా తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘చెన్నై స్టేడియంలో జరుగుతున్న రసవత్తరమైన మ్యాచ్‌ను ఆకాశం నుంచి చూశాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

  • 14 Feb 2021 03:51 PM (IST)

    నిలకడగా ఆడుతోన్న భారత బ్యాట్స్‌మెన్... 9 ఓవర్లకు భారత్ స్కోర్..

    ఇంగ్లాండ్ ఆలౌట్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (12) పరుగులతో క్రీజ్‌లో దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 37/0 వద్ద ఉంది.

  • 14 Feb 2021 03:11 PM (IST)

    భారత బౌలర్ల దూకుడుకు.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆధిక్యంలో భారత్..

    చెన్నై వేదికగా జరిగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ల హవా కొనసాగింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 59.5 ఓవర్లకు 134 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్‌ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఫోక్స్‌ (42*) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో అశ్విన్‌ (5/43) అయిదు వికెట్లతో సత్తాచాటాడు. ఇషాంత్, అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు, సిరాజ్‌ ఒక్క వికెట్‌ తీశారు. టీమిండియాకు 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది

  • 14 Feb 2021 03:02 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. జాక్‌లీచ్ అవుట్..

    ఇంగ్లాండ్ వికెట్ల పతనం కొనసాగుతోంది. 58.5 ఓవర్ వద్ద ఈశాంత్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్.. 131/9. ఇక క్రీజ్‌లో బెన్ ఫోక్స్ (39), బ్రాడ్ ఉన్నారు.

  • 14 Feb 2021 02:41 PM (IST)

    నిలకడగా ఆడుతోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. 58 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..

    ఫాలోఆన్ గండాన్ని తప్పించుకునే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 55  ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వెకెట్లు కోల్పోయి 124 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజ్‌లో బెన్‌ఫోక్స్ (29), జాక్‌లీచ్ (9) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

  • 14 Feb 2021 02:29 PM (IST)

    రెండో సెషన్ పూర్తి సమయానికి ఇంగ్లాండ్ స్కోర్...

    చెన్నై వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ సెషన్ పూర్తి సమయానికి ఇంగ్లాండ్ స్కోర్.. 106/8 వద్ద ఉంది. అంతకుముందు 39/4తో భోజన విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్ ఈ సెషన్‌లో మరో 67 పరుగులు జోడించి, నాలుగు వికెట్లు కోల్పోయింది.

  • 14 Feb 2021 02:20 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాడ్.. మోయిన్ ఔట్..

    ఇంగ్లాండ్‌తో చెన్నైవేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దూకుడు మీద ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాడ్ ఏడో వికట్‌ను పడగొట్టారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మోయిన్ అలీ (6) ఔటయ్యాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానె దూరంలో పడుతున్న బంతును అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 105 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో స్టోన్, ఫోక్స్ ఉన్నారు.

  • 14 Feb 2021 01:58 PM (IST)

    చెన్నై స్టేడియంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ జోష్

    చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెగ జోష్ లో కనిపించాడు. స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులను ఉత్సాహ పరిచాడు. విజిల్స్, చప్పట్లు కొట్టాలంటూ ప్రోత్సహించాడు. అంతేకాకుండా తాను కూడా విజిల్స్ వేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలుగించాడు. దీంతో స్టేడియంలో ఉన్న టీమిండియా అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు.

  • 14 Feb 2021 01:45 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్ తొలి తొలి బంతికే పోప్ పంత్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 14 Feb 2021 01:18 PM (IST)

    రెండో సెషన్‌లో డ్రింక్స్‌ విరామ సమయానికి...

    రెండో సెషన్‌లో డ్రింక్స్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 82/5తో కొనసాగుతోంది. పోప్‌(19), బెన్‌ఫోక్స్‌(13) నిలకడగా ఆడుతున్నారు. 52 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో జోడీ కట్టిన వీరు ఇప్పటివరకు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  అశ్విన్‌ 3 వికెట్లు తీయగా.. అక్షర్‌, ఇషాంత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

  • 14 Feb 2021 12:35 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    టీమిండియా బౌలర్లు సత్తా చూపిస్తున్నారు. అశ్విన్ మరో వికెట్ పడేశాడు. వరుస వికెట్లు కోల్పోతుండటంతో కష్టాల్లోకి పడిపోయింది ఇంగ్లాండ్. ప్రమాదకర మిడిల్ అర్డర్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్‌ను బౌల్డ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో సంగం వికెట్లను కోల్పోయింది.

  • 14 Feb 2021 11:43 AM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    టీమిండియా బౌలర్లు దూకుడ ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ 39 పరగులకు నాలుగు వికెట్లను కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లపై భారత బౌలర్ల తిప్పేస్తున్నారు. అశ్విన్ వేసిన ఓవరల్‌లో చివరి బంతికి లారెన్స్ తొమ్మిది పరుగులు చేసిన ఇంటిదారిపట్టాడు.

  • 14 Feb 2021 11:16 AM (IST)

    భారత్‌కు భారీ ఉపశమనం.. రూట్‌ ఔట్‌..

    ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 11వ ఓవర్‌ మూడో బంతికి స్వీప్‌ షాట్‌ ఆడబోయిన అతడు షార్ట్‌బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్‌ లెగ్‌లో అశ్విన్‌ చేతికి చిక్కాడు.

  • 14 Feb 2021 11:05 AM (IST)

     రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

    అశ్విన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ మూడో బంతి సిబ్లీ ప్యాడ్‌కు తగిలి మళ్లీ బ్యాట్‌ అంచున తాకడంతో కోహ్లీకి దొరికిపోయాడు. దీంతో ఆ జట్టు 16 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

  • 14 Feb 2021 11:00 AM (IST)

    కట్టడిలో ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ సిబ్లీ , లారెన్స్‌ ఆచితూచి ఆడుతున్నారు. భారత బౌలర్లు కట్డి చేస్తుండటంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలోనే 5 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 15/1గా నమోదైంది.

  • 14 Feb 2021 10:45 AM (IST)

    తొలి ఓవర్‌లోనే ఇషాంత్.. రోరీబర్న్స్ ను ఎల్బీగా..

    టీమిండియా 329 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటయ్యక ఇంగ్లాండ్ బ్యాంటింగ్ ఆరంభించింది. అయితే తొలి ఓవర్‌లోనే ఇషాంత్.. రోరీబర్న్స్ ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అతడు రివ్యూకు వెళ్లినా ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చింది.

  • 14 Feb 2021 10:31 AM (IST)

    తొలి ఇన్నింగ్స్‌లో 329 పురుగులకు టీమిండియా ఆలౌట్..

    తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడాడు. 300/6తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో ఏడు ఓవర్లే బ్యాటింగ్ చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. మెయిన్ అలీ ఆదివారం తొలి ఓవర్‌లో అక్షర్ పటేల్, ఇషాంత్‌ను ఔట్ చేయగా... 96వ ఓవర్ లో స్టోన్.. కుల్ దీప్, సిరాజ్ ను ఔట్ చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది.

  • 14 Feb 2021 10:27 AM (IST)

    ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతు రిషబ్ పంత్

    రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. టీ20ని తలపించేలా ధాటిగా ఆడుతున్నాడు.

  • 14 Feb 2021 10:24 AM (IST)

    రిషబ్ దూకుడు.. హాఫ్ సెంచరీ పూర్తి..

    రిషబ్ పంత్ దూకుడు ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిపోతున్నాడు. తొలి రోజు 33 పరుగులు చేసిన పంత్.. రెండో రోజు మరో 17 పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా 93 ఓవర్లకు 318/8తో నిలిచింది. అతడికి కుల్‌దీప్ తోడుగా ఉన్నాడు.

  • 14 Feb 2021 09:58 AM (IST)

    రెండో రోజు తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కు రెండు వికెట్లు..

    రెండో రోజు తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్ రెండు వికెట్లు పడగొట్టింది. మోయిన్ అలీ వేసిన ఓవర్‌లో అక్షర్ పటేల్ స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాంత్ శర్మ రోరీ బర్న్స్ చేతికి చిక్కాడు.

Published On - Feb 15,2021 10:27 AM

Follow us