India vs England 2nd Test : రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అశ్విన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 53/3

Narender Vaitla

| Edited By: uppula Raju

Updated on: Feb 15, 2021 | 5:40 PM

India vs England 2nd Test Day 3 Live Score: చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారీ ఆధిక్యంతో ఈరోజు మ్యాచ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బతగిలింది.

India vs England 2nd Test :  రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అశ్విన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 53/3

India vs England 2nd Test Day 3 Live Score: ఇంగ్లండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్లి సేన, పర్యాటక జట్టు కంటే 481 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌‌ బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలినా అశ్విన్‌ సెంచరీ(106), కెప్టెన్‌ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత జట్టు.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో రూట్ 2, లారెన్స్ 19 పరుగులతో నిలిచారు. అక్షర్ పటేల్ 2, అశ్విన్ 1 వికెట్ సాధించారు. విజయానికి భారత్ 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 429 పరుగులు చేయాల్పి ఉంది. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

భారత జట్టు(ఫైనల్ ఎలెవన్): రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు(ఫైనల్ ఎలెవన్): సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Feb 2021 05:09 PM (IST)

    మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 53/3..

    మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో రూట్ 2, లారెన్స్ 19 పరుగులతో నిలిచారు. అక్షర్ పటేల్ 2, అశ్విన్ 1 వికెట్ సాధించారు. విజయానికి భారత్ 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 429 పరుగులు చేయాల్పి ఉంది. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

  • 15 Feb 2021 04:59 PM (IST)

    17 ఓవర్లో మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. తొలి బంతికే ఔటైన లీచ్..

    భారత బౌలర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నిలువలేకపోతున్నారు. వెంట వెంటనే వికెట్లు చేజార్చుకుంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది. బర్న్స్‌ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన లీచ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఔటయ్యాడు. రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 50/3 వికెట్లతో ఆట కొనసాగిస్తుంది. క్రీజులో రూట్, లారెన్స్ ఉన్నారు.

  • 15 Feb 2021 04:53 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    భారత్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. భారీ లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆదిలోనే కట్టడి చేస్తున్నారు. వరుస వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను కోలుకోని దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ రెండో వికెట్ ను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కి యత్నించిన బర్న్స్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 16 ఓవర్లకు 49/2 తో ఆట కొనసాగిస్తోంది. క్రీజులో లారెన్స్ 17 పరుగులు, లీచ్ ఉన్నారు.

  • 15 Feb 2021 04:45 PM (IST)

    నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్..

    భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతుంది. ఇప్పటికే సిబ్లీ ఔట్ కావడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది. మరోవైపు బౌండరీలు కూడా సాధిస్తున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లాండ్ 46/1 తో ఆట కొనసాగిస్తోంది. బర్న్స్‌ 24, లారెన్స్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ తొమ్మిది వికెట్ల దూరంలో ఉంది.

  • 15 Feb 2021 04:33 PM (IST)

    8 ఓవర్లో 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్సర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఓపెనర్ సిబ్లీ ఎల్‌బీడబ్లూగా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్లినా ఔట్ అని తేలింది. ప్రస్తుతం క్రీజులో బర్న్స (14), లారెన్స్ ఆడుతున్నారు.

  • 15 Feb 2021 04:12 PM (IST)

    భారీ లక్ష్య సాధనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌటైంది. పర్యాటక జట్టుకు 482 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంబించిన ఇంగ్లాండ్ 2 ఓవర్లకు 6/0 పరుగులతో ఆడుతోంది. ఇషాంత్ వేసిన తొలిబంతినే బర్న్స్ బౌండరీ బాదాడు. మరోవైపు సిబ్లీ కూడా జాగ్రత్తగా ఆడుతున్నాడు.

  • 15 Feb 2021 03:47 PM (IST)

    రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 482 పరుగులు..

    రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టుకు 482 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టోన్ బౌలింగ్‌లో అశ్విన్ భారీ షాట్‌కు యత్నించి బోల్డ్ అయ్యాడు. కాగా అశ్విన్ 106 పరుగులు చేశాడు. సిరాజ్ 21 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్, అలీ చెరో నాలుగు వికెట్లు తీశారు.

  • 15 Feb 2021 03:34 PM (IST)

    మూడంకెల స్కోరుకు చేరుకున్న రవిచంద్రన్ అశ్విన్..

    82 ఓవర్లో భారత్ 268/9 పరుగులతో కొనసాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించి (103) పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు. మొయిన్ అలీ వేసిన 82 ఓవర్లో సిక్సర్, బౌండరీ బాది మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. అశ్విన్ కు ఇది ఐదో సెంచరీ కాగా భారత్ 463 పరుగుల ఆధిక్యంతో దూసుకెళుతుంది. మరోవైపు మహ్మద్ సిరాజ్ అశ్విన్ కు చక్కటి సహకారం అందిస్తున్నాడు.

  • 15 Feb 2021 03:20 PM (IST)

    సెంచరీతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్..

    82 ఓవర్లకు భారత్ 268/9 పరుగులతో కొనసాగుతుంది. ఇప్పటి వరకు టీం ఇండియా 463 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరోవైపు అశ్విన్ శతకంతో అదరగొట్టాడు. సిరాజ్ చక్కటి సహకారం అందిస్తున్నాడు.

  • 15 Feb 2021 03:09 PM (IST)

    సెంచరీ దిశగా ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్

    79 ఓవర్లకు భారత్ 246/9 పరుగులు చేసింది. అశ్విన్ 86 పరుగులతో సెంచరీ దిశగా ఆడుతున్నాడు. అయితే మరో వికెట్ పడకుండా ఉంటేనే అశ్విన్ శతకం పూర్తిచేస్తాడు. దీనికి సిరాజ్ సహకారం తప్పనిసరి అవుతుంది. స్టేడియంలో అభిమానులు అశ్విన్‌కు మద్దతు తెలుపుతూ సందడి చేస్తున్నారు.

  • 15 Feb 2021 03:01 PM (IST)

    ఇషాంత్ ఔట్..

    జాక్ లీచ్ వేసిన 77 ఓవర్లో ఇషాంత్ శర్మ (7) ఔటయ్యాడు. దీంతో భారత్ 237 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్ పూర్తయ్యే సరికి భారత్ 241/9 తో కొనసాగుతోంది. అశ్విన్ 82 పరుగులతో ఆడుతున్నాడు. మహ్మద్ సిరాజ్ పదో వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. ఇప్పటి వరకు భారత్ ఆధిక్యం 437 పరుగులు.

  • 15 Feb 2021 02:57 PM (IST)

    బౌండరీలే లక్ష్యంగా ఆడుతున్న అశ్విన్..

    75 ఓవర్లకు భారత్ 230/8 పరుగులు చేసింది. స్టువార్ట్ బ్రాడ్ వేసిన 75 ఓవర్లో అశ్విన్ చక్కటి బౌండరీ బాదాడు. అయితే అంతకు ముందు వేసిన అలీ ఓవర్లో అశ్విన్‌కు లైఫ్ లభించింది. అతడికి ఇషాంత్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు టీం ఇండియా 425 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 15 Feb 2021 02:32 PM (IST)

    టీ బ్రేక్.. 73 ఓవర్లు ముగిసేసరికి భారత్ 221-8..

    టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. తొలుత వికెట్లు వెంటవెంటనే పడినా కెప్టెన్ విరాట్ కోహ్లీ(62), అశ్విన్(68) చక్కటి భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలోనే ఆధిక్యాన్ని 400 దాటించారు. ప్రస్తుతం టీ బ్రేక్ కాగా.. ఇండియా 73 ఓవర్లు ముగిసేసరికి 221-8 పరుగులు చేసింది.

  • 15 Feb 2021 01:49 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. కుల్దీప్‌ యాదవ్‌ అవుట్‌..

    విరాట్‌, అశ్వీన్‌ల పాట్నర్న్‌షిప్‌ను బ్రేక్‌ చేసిన మోయిన్‌ అలీ అదే ఓవర్‌లో మరో వికెట్‌ తీసుకున్నాడు. విరాట్‌ అవుట్‌ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌..కేవలం మూడు పరుగులకే మోయిన్‌ అలీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 210 వద్ద ఉంది.

  • 15 Feb 2021 01:38 PM (IST)

    విరాట్‌ కోహ్లి అవుట్‌… 96 పరుగుల వద్ద భాగస్వామ్యాన్ని విడగొట్టిన మోయిన్‌ అలీ..

    భారత స్కోర్‌ను పరిగెత్తిస్తూ మంచి పాట్నర్న్‌షిప్‌ నెలకొపిన విరాట్‌, అశ్వీన్‌ల భాగస్వామ్యాన్ని మోయిన్‌ అలీ విడగొట్టాడు. 202 పరుగుల వద్ద మోయిన్‌ అలీ విసిరిని బంతికి విరాట్‌ అవుట్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో విరాట్‌, అశ్వీన్‌ల మంచి ఆటకు తెరపడింది.

  • 15 Feb 2021 01:14 PM (IST)

    అర్థ శతకంతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అశ్విన్‌..

    మంచి ఆట తీరును కనబరుస్తూ జట్టును ఆదుకునే పనిలో పడ్డ అశ్విన్‌ ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీయడంతో పాటు హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాళ్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

  • 15 Feb 2021 01:05 PM (IST)

    అశ్విన్‌ కూడా ఆఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు..

    వరుస వికెట్లు పడుతుండడంతో గాడితప్పుతోందన్న మ్యాచ్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ అశ్విన్‌, కోహ్లి ఆ క్రమంలో విజయవంతమవుతున్నారు. ఈ క్రమంలో విరాట్‌ ఆఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. ఇప్పుడు అశ్విన్‌ కూడా అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. 7 బౌండరీలతో 65 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన అశ్విన్‌ జట్టు స్కోర్‌ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 6 వికెట్ల నష్టానికి 193 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 01:00 PM (IST)

    అరే.. పుజారా ఎలా అవుట్‌ అయ్యాడో చూశారా.. బ్యాడ్ లక్‌ కదూ..!

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చెటేశ్వర్‌ పుజారా అవుట్‌ అయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. మోయిన్‌ అలీ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడబోయిన పుజారా ప్యాడ్‌కు తగిలి బంతి షార్ట్‌ లెగ్‌లో ఉన్న పోప్ చేతికి చిక్కింది. దీంతో అతడు వెంటనే బంతిని వికెట్‌ కీపర్‌కు అందించాడు. అంతలోపే క్రీజ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించినా.. పుజారా చేతిలో నుంచి బ్యాట్‌ కింద పడిపోయింది. కాలును క్రీజులో పెట్టేలోపే కీపర్‌ అవుట్ చేసేశాడు.

  • 15 Feb 2021 12:42 PM (IST)

    నిలకడగా కొనసాగుతోన్న భారత్‌ స్కోర్‌… విరాట్‌ హాఫ్‌ సెంచరీ..

    మూడో రోజు మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో టీమిండియాను ఆదుకున్నారు కెప్టెన్‌ కోహ్లీ, అశ్విన్‌. కీలక సమయంలో రాణించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 176/6 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 11:42 AM (IST)

    లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత స్కోర్‌ 156/6..

    మూడో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 156/6 పరుగుల వద్ద కొనసాగుతోంది. మ్యాచ్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ కెప్టెన్‌ కోహ్లీ (38), అశ్విన్‌ (34) పరుగులతో కొనసాగుతున్నారు. 106 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో వీరిద్దరు కలిసి జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం భారత్‌ 351 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 15 Feb 2021 11:35 AM (IST)

    బౌండరీలు బాదుతోన్న కోహ్లి, అశ్విన్‌..

    టీమిండియా వికెట్ల పతనానికి చెక్‌ పెడుతూ బ్యాటింగ్‌ కొనసాగిస్తోన్న కోహ్లి, అశ్విన్‌ను జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు బంతులను బౌండరీకి తరలిస్తూ నెమ్మదిగా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

  • 15 Feb 2021 11:30 AM (IST)

    నిలకడగా ఆడుతోన్న భారత బ్యాట్స్‌మెన్‌.. జట్టును ఆదుకునే పనిలో పడ్డ కోహ్లి, అశ్విన్‌..

    మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఆదుకునే పనిలో పడ్డారు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్. మరో వికెట్‌ పడకుండా చూసుకుంటూనే జట్టు స్కోరును పెంచుకుంటూ పోతున్నారు. 47 ఓవర్లు ముగిసే సమయానికి కోహ్లి (35), అశ్విన్‌ (30 ) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ జట్టును అత్యల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌ ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ టీమిండియాకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 149/6 వద్ద ఉంది.

  • 15 Feb 2021 10:52 AM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. వెనుదిరిగిన అక్సర్‌ పటేల్‌..

    మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత వికెట్ల పతనం కొనసాగుతోంది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా. తాజాగా అక్సర్‌ పటేల్‌ అవుట్‌ అయ్యాడు. 36.1 ఓవర్ల వద్ద మోయిన్‌ అలీ బౌలింగ్‌లో అక్సర్‌ వికెట్ల ముందు (ఎల్‌బీడబ్ల్యూ) దొరికిపోయాడు.

  • 15 Feb 2021 10:43 AM (IST)

    కొనసాగుతోన్నవికెట్ల పతనం.. ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌..

    మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత వికెట్ల పతనం కొనసాగుతోంది. ఇప్పటికే పుజారా, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌ అవుట్‌ కాగా. తాజాగా అజింకా రహానే పెవిలీయన్‌ బాట పట్టాడు. 30.3 ఓవర్‌ వద్ద రహానే అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 31.4 వద్ద 92/5 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 10:43 AM (IST)

    వరుసగా వికెట్లు కోల్పోతున్న భారత్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..

    భారీ ఆధిక్యంతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండాయకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. మ్యాచ్‌ ప్రారంభించిన కాసేపటికే పుజారా, రోహిత్‌ శర్మ పెవిలియన్‌ బాట పట్టగా తాజాగా రిషబ్‌ పంత్‌ కూడా అవుట్‌ అయ్యాడు. 25.3 ఓవర్‌ వద్ద జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌ చేతిలో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 26.4 ఓవర్ల వద్ద 69/4 కొనసాగుతోంది.

  • 15 Feb 2021 10:42 AM (IST)

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ శర్మ అవుట్‌..

    మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన కాసేపటికే భారత బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌ బాట పడుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభం కాగానే పుజారా రన్‌ అవుట్‌ కాగా.. 21.1 ఓవర్‌ వద్ద రోహిత్‌ శర్మ (26) స్టంప్ అవుటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 58/3 వద్ద కొనసాగుతోంది.

  • 15 Feb 2021 10:42 AM (IST)

    మూడో రోజు మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌.. ఆదిలోనే వికెట్‌ కోల్పోయిన భారత్‌..

    భారీ ఆధిక్యంతో మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 19 ఓవర్ల వద్ద పూజారా కేవలం ఏడు పరుగుల స్వల్ప స్కోర్కే రన్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్‌ శర్మ (26), విరాట్‌ కోహ్లి (0) ఉన్నారు.

Published On - Feb 15,2021 5:10 PM

Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!