India vs England: ఓ వైపు బ్యాటింగ్ చేస్తూ.. మరోవైపు యోగా చేస్తూ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న రహానే ఫోటోలు..
India vs England: ‘యోగా’కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు తమ..
India vs England: ‘యోగా’కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రధానంగా యోగానే ఎంచుకుంటున్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్నే కాదు.. తమ మనసునూ ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కాసేపు ధ్యానం చేయడం ద్వారా మానసిక గందరగోళం నుంచి ఇట్టే బయటపడొచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ శనివారం నాడు ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. ఒకానొక సందర్భంలో యోగా ముద్రలో కనిపించాడు.
రహానే యోగా ముద్రలో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాటింగ్‌కు దిగే ముందు స్టేడియం వెలుపల కాసేపు ధ్యానం చేసిన రహానే.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ ఒకసారి ధ్యానం చేశాడు. రహానే క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కాస్త సమయం దొరికింది. దాంతో అతను కాసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేశాడు. అయితే, రహానే ధ్యానముద్రను స్టేడియంలోని కెమెరాలు పసిగట్టాయి. ఇంకేముందు రహానే మొహాన్ని క్లోజప్‌లో క్లిక్ మనిపించాయి. దాంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రహానే ధ్యానంపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. క్లిష్ట సమయంలో కూల్‌గా ఉండేందుకు ధ్యానం చేస్తున్నాడని కొందరంటే.. రహానే ఒక యోధుడు అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.
Viral Tweet:
It’s a common occurrence before and during a Ajinkya Rahane knock. Him in a brief state of deep meditation #IndvEng pic.twitter.com/pmLnyFsbGm
— Bharat Sundaresan (@beastieboy07) February 13, 2021
Also read:
India vs England: సౌండ్ సరిపోవట్లేదు.. ఇంకా పెంచండెహే.. తెగ వైరల్ అవుతున్న కోహ్లీ ‘విజిల్’ వీడియో..