India vs England: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్.. హర్బజన్ సింగ్‌ను బీట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పిన రవిచంద్రన్ అశ్విన్..
Ravichandran ashwin: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్..
Ravichandran ashwin: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. వరుస వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 5 వికెట్లు తీసుకుని సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసుకున్న టీమిండియా బౌలర్ల జాబితాలో హర్బజన్ సింగ్‌ను వెనక్కి నెట్టి అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసుకున్న జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే-350 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆ తరువాత రెండో స్థానంలో 255 వికెట్లతో హర్బజన్ సింగ్ ఉన్నాడు. అయితే తాజాగా రవిచంద్రన్ అశ్విన్ 266 వికెట్లు సాధించి హర్బన్ సింగ్‌ను వెనక్కి నెట్టాడు. తద్వారా ఈ జాబితాలో అశ్విన్ రెండోస్థానంలో నిలిచాడు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అశ్విన్ ఖాతాల్లో 350 వికెట్లు పడ్డాయి. ఈ 350వ వికెట్ కూడా స్వదేశంలోనే పడటం విశేషం. ఇక స్వదేశం సహా, విదేశాల్లోనూ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో 476 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, 376 వికెట్లతో హర్బజన్ రెండోస్థానంలో ఉన్నాడు. అయితే, సెకండ్ ప్లేస్‌లో ఉన్న హర్బజన్‌ను అశ్విన్ త్వరలోనే బీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు క్రికెట్ నిపుణులు.
Also read:
Ind vs Eng Live: కట్టడిలో ఇంగ్లాండ్.. భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి.. 39 పరుగులు