పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు తీవ్రమైంది. సీఎం అమరేందర్ సింగ్ కి వ్యతిరేకంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది.

పంజాబ్ కాంగ్రెస్  లో అసమ్మతి చిచ్చు... చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా ...?
Cm Amarinder Singh

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు తీవ్రమైంది. సీఎం అమరేందర్ సింగ్ కి వ్యతిరేకంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. అసమ్మతీయులు లేవనెత్తిన అంశాలపై ఆరా తీసేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇదివరకే ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సమర్పించనున్న నివేదికను ఆమె పరిశీలించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ముఠాతత్వం పెరిగిపోయిందని, సీఎం ఆశ్రిత పక్షపాతం, అవినీతి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని అసమ్మతి వర్గం చేసిన ఆరోపణలను అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా పార్టీ నేత నవ జ్యోత్ సింగ్ సిద్దు ….సీఎంపై గల ఎప్పుడో 2015 నాటి కేసును మళ్ళీ తిరగదోడడాన్ని కూడా సోనియా పరిగణనలోకి తీసుకున్నారు మరి కొన్ని నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమరేందర్ సింగ్ నాయకత్వంపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి పంజాబ్ నాయకత్వ మార్పు లేదని అంటున్నా పార్టీ హైకమాండ్ మాత్రం ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు కమిటీని నియమించడమే విశేషంగా చెబుతున్నారు. ఇటీవల ఈ కమిటీ సభ్యులతో సమావేశమైన అమరేందర్ సింగ్ తాను ఎలాంటి పొరబాట్లు చేయలేదని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ కమిటీ సభ్యులు తమ నివేదికను సిధ్ధం చేశారని..రేపో మాపో దీన్ని సోనియాకు అందజేస్తారని తెలుస్తోంది. దీని ఆధారంగా అమరేందర్ సింగ్ భవితవ్యంపై చర్యలు తీసుకునే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: YSR Cheyutha Scheme 2021: గుడ్‌న్యూస్.. ‘వైఎస్ఆర్ చేయూత’ దరఖాస్తు గడుపు పెంపు.. మరో నెల రోజులు అవకాశం..

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: స్వల్ప ఆధిక్యాంలో కోహ్లీ సేన

Click on your DTH Provider to Add TV9 Telugu