నా కష్ట కాలంలో బీజేపీ మౌనం నన్ను బాధిస్తోంది… లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ విచారం

తన సొంత పార్టీలో తాను సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటుండగా బీజేపీ మౌనం వహిస్తుండడం తనను బాధిస్తోందని లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు...

నా కష్ట కాలంలో బీజేపీ మౌనం నన్ను బాధిస్తోంది... లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ విచారం
Chirag Paswan
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 22, 2021 | 9:42 PM

తన సొంత పార్టీలో తాను సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటుండగా బీజేపీ మౌనం వహిస్తుండడం తనను బాధిస్తోందని లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు, బీజేపీతో తన సంబంధాలు ఏకపక్షంగా ఉండరాదని ఆయన కోరారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్, తాను భారతీయ జనతా పార్టీకి ఓ పెద్ద రాక్ (కొండ) మాదిరి ఉంటూ వచ్చామని,, కానీ తమ ఎల్ జె పీ లో రెబెల్స్ నుంచి తనకు సమస్యలు ఎదురవుతున్నప్పుడు జోక్యం చేసుకోకుండా కమలం పార్టీ ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ పట్ల తనకు ఇంకా విశ్వాసం, గౌరవం ఉన్నాయని, కానీ ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తే తమ పార్టీ ప్రత్యామ్న్యాయాల గురించి యోచించవలసి వస్తుందన్నారు. మా పార్టీలో చీలికలు సృష్టించడానికి జనతాదళ్ -యూ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పోకడను అడ్డుకుని తమకు అండగా ఉండాల్సిన బీజేపీ అంటీఅంటనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. వారి మౌనం నన్ను అమితంగా బాధిస్తోంది అని అయన ఓ వార్తాసంస్థ వద్ద వాపోయారు.

ఇలా ఉండగా తమ నేత చిరాగ్ పాశ్వాన్ ని అభిమన్యునిగా పోలుస్తూ ఆయన మద్దతుదారులు పోస్టర్లను విడుదల చేశారు.. సీఎం నితీష్ కుమార్, ఇతర రెబెల్ నేతలు పన్నిన ‘చక్రవ్యూహం’ లో చిక్కుకున్న అభిమన్యుని మాదిరి వారు చిరాగ్ ను పోల్చారు. ఇదే సమయంలో నితీష్ ను ‘ బీహారీ’ అనే మూవీ డైరెక్టర్ గా.. పశుపతి కుమార్ పరస్ ను బంటుగా,, ఎంపీ సూర్ భజన్ సింగ్ ను విలన్ గా వారు ఈ పోస్టర్లలో చూపారు. తమది మహాభారత పోరాటం వంటిదని, తమను పాండవులుగా..రెబెల్ నేతలను కౌరవులుగా చిరాగ్ అభివర్ణించారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Tuberculosis: టీబీ చికిత్సలో సాధారణ యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా పని చేస్తాయి..తాజా పరిశోధనల్లో వెల్లడి

Black Pepper Tea: సీజనల్ వ్యాధులతో సహా సైనస్ తో ఇబ్బంది పడుతున్నారా ఈ టీని తాగండి అద్భుత ఫలితాలు పొందండి