ఇక ఇండియాలో త్వరలో ఫైజర్ వ్యాక్సిన్… తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నామన్న సీఈఓ…
ఇండియాలో తమ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి త్వరలో ఆమోదం లభించే సూచనలు ఉన్నాయని ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో రేపో..
ఇండియాలో తమ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి త్వరలో ఆమోదం లభించే సూచనలు ఉన్నాయని ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో రేపో..మాపో ఒప్పందం ఖరారు కానుందని ఆయన చెప్పారు. ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసిఐ) నిర్ణయించిన నేపథ్యంలో ఫైజర్ కంపెనీ సీఈఓ ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. మొదట ఇండియాలో విదేశీ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. అలాగే అప్రూవల్ కి కూడా పలు రూల్స్ ఉంటూ వచ్చాయి. కానీ దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతోను, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా జరగడంతోను డీజీసీఐ వైఖరిని మార్చుకుంది. ఇండియాలో ఆయా విదేశీ సంస్థలు పరిమితంగా ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధనను పక్కన పెట్టింది. వివిధ కంపెనీలు దీని అనుమతికోసం వేచి ఉండాలన్న రూల్ ని కూడా సడలించింది.ఈ కారణాల వల్ల ఈ విధమైన నిబంధనలను రద్దు చేశామని ఈ సంస్థ చీఫ్ వీ.జీ.సొమానీ తెలిపారు.
పైగా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై గల నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ కూడా ఈ మేరకు సిఫారసు చేసిందన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కి కూడా అనుమతి లభించిన పక్షంలో…ఇండియాలో .స్పుత్నిక్ వీ తరువాత ఇది మరో రెండో విదేశీ టీకామందు అవుతుంది. కాగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అయితే వచ్చింది గానీ దేశంలో ఎంతమంది ఈ టీకామందు తీసుకున్నారన్న వివరాలు తెలియడంలేదు. కోవీషీల్డ్, కొవాగ్జిన్ టీకామందుల పేర్లే వినిపిస్తున్నాయని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Zodiac Signs: మీ రాశి చక్రాన్ని బట్టి మీ తోబుట్టువులతో అనుబంధం ఎలా ఉంటుందో చెప్పవచ్చు.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి