AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Langra Mango : మామిడి పండ్లలో రారాజు కుంటి మామిడి..! దీని కథలో శివుడు, ఆలయ పూజారి పాత్రలు.. నిజంగా జరిగిందట..

Langra Mango :1,000 వాణిజ్య రకాలు సహా 1,500 రకాల మామిడి పండ్లు భారతదేశంలో కనిపిస్తాయి. భారతదేశంలో లభించే

Langra Mango : మామిడి పండ్లలో రారాజు కుంటి మామిడి..! దీని కథలో శివుడు, ఆలయ పూజారి పాత్రలు.. నిజంగా జరిగిందట..
Langra Mango
uppula Raju
|

Updated on: Jun 22, 2021 | 8:28 PM

Share

Langra Mango :1,000 వాణిజ్య రకాలు సహా 1,500 రకాల మామిడి పండ్లు భారతదేశంలో కనిపిస్తాయి. భారతదేశంలో లభించే మామిడి పండ్లలో ప్రత్యేకత ఏంటంటే పేరు, రుచి భిన్నంగా ఉంటాయి. భారతదేశం ప్రతి సంవత్సరం 15 మిలియన్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది కానీ విదేశాలలో కూడా భారతీయ మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోని 40 దేశాలకు భారతీయ మామిడి ఎగుమతి అవుతుంది. ఈ సందర్భంగా అరుదైన మామిడి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దీనిపేరు లాంగ్రా మామిడి. దీనికి కుంటి మామిడి అని పేరు వచ్చింది. ఈ కథ సుమారు 300 సంవత్సరాల పురాతనమైనది. కుంటి మామిడి అద్భుతమైన రుచి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ దాని పేరు ఎలా వచ్చింది బహుశా చాలా కొద్ది మందికి తెలుసు. లాంగ్డా మామిడి కథను ప్రారంభించే ముందు దాని సాగు ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో ప్రారంభమైందని తెలుసుకోవాలి.

బనారస్ శివాలయానికి వచ్చిన సన్యాసి చెట్టును నాటాడు బనారస్ లో ఉన్న శివుడి ఆలయంలో పూజారి ఉండేవాడు. అతడు కుంటివాడు. పూజారి వైకల్యం కారణంగా ప్రజలు అతనిని కుంటి పూజారి పేరుతో పిలుస్తారు. ఒకరోజు ఒక సన్యాసి ఆలయంలో ఉండటానికి వచ్చాడు. అతను అక్కడ రెండు మామిడి మొక్కలను నాటాడు. మొక్క ఒక చెట్టుగా పెరిగి పండ్లు ఇవ్వడం ప్రారంభించినప్పుడు దాని మొదటి ఫలం శివుడికి అర్పించాలని పూజారికి చెప్పాడు. ఇది కాకుండా సన్యాసి ఈ చెట్టు ఫలాలను ఎవ్వరికి ఇవ్వొద్దని సూచిస్తాడు.

చాలా సంవత్సరాల తరువాత చెట్టు పండ్లు ఇవ్వడం ప్రారంభించినప్పుడు పూజారి మొదట ఆ పండ్లను శివుడికి అర్పిస్తాడు. అయితే కొంతకాలం తర్వాత బనారస్ రాజు పూజారి నుంచి మామిడి పండ్లను తీసుకున్నాడు. సన్యాసి ఆ చెట్ల మామిడిని ఇతరులకు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆలయం మామిడి రాజుకు చేరిన వెంటనే ఇది క్రమంగా బనారస్ అంతటా ప్రసిద్ది చెందింది. ప్రజలు దీనిని పూజారి వైకల్యాన్ని చూసి కుంటి మామిడి అని పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ మామిడి పేరు కుంటి మామిడిగా మారింది. భారతదేశంలో లాంగ్డా మామిడిని ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌లో పండిస్తారు.

PPF Clients : పీపీఎఫ్ ఖాతాదారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..! లేదంటే మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇబ్బందులు..

Savitri Real Life: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం

తొమ్మిది దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్… ఇండియాలో 22 కేసులు… కేంద్రం ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు