YSR Cheyutha Scheme 2021: గుడ్‌న్యూస్.. ‘వైఎస్ఆర్ చేయూత’ దరఖాస్తు గడుపు పెంపు.. మరో నెల రోజులు అవకాశం..

YSR Cheyutha application date: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు వరుసగా రెండో ఏడాది

YSR Cheyutha Scheme 2021: గుడ్‌న్యూస్.. ‘వైఎస్ఆర్ చేయూత’ దరఖాస్తు గడుపు పెంపు.. మరో నెల రోజులు అవకాశం..
Ysr Cheyutha
Follow us

|

Updated on: Jun 22, 2021 | 10:34 PM

YSR Cheyutha application date: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా మంగళవారం నగదు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక ప్రకటన చశారు.

వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కొత్తవారికి మరింత సమయమివవ్వనున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో నెలరోజులు గడువు పెంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు వైఎస్ఆర్ చేయూత కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దారఖాస్తుదారులు ఏదైన విషయాలను తెలుసుకునేందుకు 0866-2468899, 9392917899 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. అవసరమైన సాయం, శిక్షణ అందించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.

Also Read:

Tadepalli Gang Rape Case: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..

Exams In AP: త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తాం.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీం వ్యాఖ్య‌లు.