AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. 32 పరుగుల ఆధిక్యంలో టీమిండియా…

India vs New Zealand Live Score: సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్ ఐదో రోజు కోహ్లీ సేన 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది.

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. 32 పరుగుల ఆధిక్యంలో టీమిండియా...
Cricket Live
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2021 | 3:54 PM

Share

సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్ ఐదో రోజు టీమిండియా 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరు రిజర్వ్‌డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64/2తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(30/ 81 బంతుల్లో 2×4), శుభ్‌మన్‌గిల్‌(8/33 బంతుల్లో) నిరాశపరిచారు. వీరిద్దర్నీ టిమ్‌సౌథీ పెవిలియన్ దారి పట్టించాడు. ప్రస్తుతం క్రీజులో చెతేశ్వర్‌ పుజారా(12/ 55 బంతుల్లో 2×4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(8/12 బంతుల్లో) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

అంతకు ముందు… కివీస్ 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది.  భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

మంగళవారం ఆటలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(49/ 177 బంతుల్లో 6ఫోర్లు) బ్యాటింగ్‌ హైలెట్‌‌గా నిలిచాడు. తొలి సెషన్‌ నుంచి భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు మంచి స్కోరు అందించాడు. వరుస వికెట్లు పడిపోతున్నా… తాను మాత్రం నిలకడగా.. దూకుడుతో ఆడుతూ టీమిండియా ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు. ఆఖర్లో టిమ్‌ సౌథీ (30/46 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు)..కేన్‌కు సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. టాప్‌ ఆర్డర్‌లో డేవన్‌ కాన్వే(54), టామ్‌ లాథమ్‌(30) రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 92.1 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jun 2021 11:28 PM (IST)

    రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌

    భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64/2తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(30/ 81 బంతుల్లో 2×4), శుభ్‌మన్‌గిల్‌(8/33 బంతుల్లో) నిరాశపరిచారు. వీరిద్దర్నీ టిమ్‌సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఔట్‌ చేశాడు. ప్రస్తుతం క్రీజులో చెతేశ్వర్‌ పుజారా(12/ 55 బంతుల్లో 2×4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(8/12 బంతుల్లో) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • 22 Jun 2021 10:16 PM (IST)

    స్వల్ప ఆధిక్యాంలో కోహ్లీ సేన

    తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ సాధించిన 32 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 15 ఓవర్లకు 32/1గా నమోదైంది. రోహిత్‌(19), పుజారా(4) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • 22 Jun 2021 09:57 PM (IST)

    శుభ్‌మన్‌గిల్‌(8) ఔట్..

    రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌గిల్‌(8) ఔటయ్యాడు. టిమ్‌ సౌథీ వేసిన 10.4 ఓవర్‌కు LBW గా వెనుదిరిగాడు. దాంతో భారత్‌ 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

  • 22 Jun 2021 09:39 PM (IST)

    జాగ్రత్తగా ఆడుతున్నారు

    టీమిండియా ఓపెనర్లు రోహిత్‌శర్మ(9), శుభ్‌మన్‌గిల్‌(2) జాగ్రత్తగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి వారిద్దరూ 11 పరుగులు చేశారు. దాంతో న్యూజిలాండ్‌ కన్నా ఇంకా 21 పరుగుల వెనుకంజలో ఉన్నారు.

  • 22 Jun 2021 09:29 PM (IST)

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌…

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ కోసం ఎంట్రీ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(4), శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2 ఓవర్లకు జట్టు స్కోర్‌ 4/0గా నమోదైంది. ప్రస్తుతం టీమిండియా 28 పరుగుల వెనుకంజలో ఉంది.

  • 22 Jun 2021 09:15 PM (IST)

    న్యూజిలాండ్‌ 249 ఆలౌట్‌

    భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

  • 22 Jun 2021 08:53 PM (IST)

    విలియమ్సన్ వేగానికి బ్రేక్.. ఇషాంత్ ఖాతాలో  మూడు వికెట్లు

    న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన విలియమ్సన్ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు ముందు ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగులో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 177 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఆరు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఈ వికెట్‌తో ఇషాంత్ ఖాతాలో  మూడు వికెట్లు చేరాయి

  • 22 Jun 2021 08:44 PM (IST)

    ప్రస్తుతం 19 పరుగుల ఆధిక్యంలో..

    న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 96.3 ఓవర్‌కు నీల్‌వాగ్నర్‌ డకౌటయ్యాడు. దాంతో ఆ జట్టు 234 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ నష్టపోయింది. మరోవైపు సౌథీ(23) వేగంగా పరుగులు చేస్తుండగా ట్రెంట్‌బౌల్ట్‌ (1) క్రీజులోకొచ్చి సింగిల్‌ తీశాడు. 97 ఓవర్లకు న్యూజిలాండ్‌ 236/9తో కొనసాగుతోంది. ప్రస్తుతం 19 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • 22 Jun 2021 08:01 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన కివీస్..

    న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. ఐదో రోజు ఆటను నెమ్మదిగా మొదలు పెట్టిన కివీస్… ఆట ముగుస్తున్న సమయానికి ధాటిగా ఆడటం మొదలు పెట్టింది. వేగంగా ఆడుతున్న కైల్‌ జేమీసన్‌(21/ 16 బంతుల్లో 1×6) ఔటయ్యాడు. షమి వేసిన 87వ ఓవర్‌ చివరి బంతికి భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి  బౌండరీ వద్ద బుమ్రా చేతికి దొరికి పోయాడు. దాంతో ఆ జట్టు 192 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌(37), సౌథీ ఉన్నారు. 87 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 192/7గా నమోదైంది.

  • 22 Jun 2021 07:59 PM (IST)

    అంపైర్స్‌ కాల్‌తో విలియమ్సన్‌ తప్పించుకున్నాడు…

    కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నిదానంగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ 85 ఓవర్లకు 179/6తో నిలిచింది. అయితే, షమి వేసిన 84.5 ఓవర్‌కు విలియమ్సన్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడి కాలికి బంతి తగలడంతో టీమిండియా అప్పీల్‌ చేసినప్పటికీ అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో రివ్యూకు వెళ్లింది. అక్కడ అంపైర్స్‌ కాల్‌తో విలియమ్సన్‌ కొద్దిలో తప్పించుకున్నాడు.

  • 22 Jun 2021 07:57 PM (IST)

    గ్రాండ్‌హోం ఔట్… షమీ ఖాతాలో మరో వికెట్..

    పేసర్‌ మహ్మద్‌ షమీ వేసిన 83వ ఓవర్లో గ్రాండ్‌హోం(13) ఔటయ్యాడు. మ్యాచ్‌లో అతనికిది మూడో వికెట్‌ కావడం విశేషం. లంచ్‌ విరామానికి ముందు తొలి సెషన్‌లో మూడు వికెట్లు పడగొట్టిన భారత్‌ ఆ తర్వాత మరో వికెట్‌ తీసి మ్యాచ్‌పై పట్టుబిగించింది.

  • 22 Jun 2021 06:14 PM (IST)

    లంచ్‌ విరామ సమయానికి.. 135/05

    వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రాస్‌ టేలర్‌(11), బీజే వాట్లింగ్‌(1)లను షమీ పెవిలియన్‌ పంపాడు. మధ్యలో మరో స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మ హెన్రీ నికోల్స్‌ను ఔట్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో కివీస్‌ కష్టాల్లో పడింది. లంచ్‌ విరామ సమయానికి న్యూజిలాండ్‌ 5 వికెట్లకు 135 పరుగులు చేసింది.

  • 22 Jun 2021 05:34 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోన న్యూజిలాండ్‌

    కివీస్ మూడో వికెట్‌ కోల్పోయింది. షమి వేసిన 63.1 ఓవర్‌కు రాస్‌టేలర్‌ (11/ 37 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ ముందుకు దూకి అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో న్యూజిలాండ్‌ 117 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు విలియమ్సన్‌(15) పరుగులతో కొనసాగుతుండగా హెన్రీ నికోల్స్‌(1) క్రీజులోకి వచ్చి సింగిల్‌ తీశాడు. 64 ఓవర్లకు కివీస్‌ 123/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 94 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.

  • 22 Jun 2021 05:10 PM (IST)

    ఆచి తూచి ఆడుతున్న కివీస్.. డ్రింక్ టైమ్

    మొదటి సెషన్‌లో వికెట్ తీసేందుకు టీమిండియా బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఆచి తూచి ఆడుతున్నారు. డ్రింక్స్ సమయానికి న్యూజిలాండ్ 117/2 (62.4) స్కోర్ తో కొనసాగుతోంది.

  • 22 Jun 2021 04:43 PM (IST)

    వికెట్లు తీయడంపై ఫోకస్ పెట్టిన టీమిండియా

    న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మూడో రోజు ఆట 49 ఓవర్లకు 101/2తో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం తిరిగి మ్యాచ్‌ ప్రారంభమయ్యాక బుమ్రా ఒక ఓవర్‌ వేయగానే కివీస్‌ 50 ఓవర్ల ఆట పూర్తి చేసింది.

    India Look For Quick Wicket

    India Look For Quick Wicket

  • 22 Jun 2021 04:04 PM (IST)

    ప్రారంభమైన ఐదో రోజు ఆట..

    ఐదో రోజు ఆట మొదలైంది. వర్షం కారణంగా ఔట్​ఫీల్డ్​ మొత్తం తడిసి పోవడంతో గంట ఆలస్యమైంది. మూడో రోజు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 101/2తో నిలిచిన సంగతి తెలిసిందే. కేన్‌ విలియమ్సన్‌(12), రాస్‌టేలర్‌(9) క్రీజులో ఉన్నారు. సోమవారం నాలుగో రోజు పూర్తిగా వర్షం పడటంతో ఆట జరగలేదు. ఇక ఈరోజు, బుధవారం మాత్రమే మ్యాచ్‌ జరిగేందుకు అవకాశం ఉంది.

Published On - Jun 23,2021 2:10 AM