ఏడేళ్లకు మందు తర్వాత తెలంగాణ ఎలా ఉందో ఆలోచించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి

గడిచిన 7 సంవత్సరాల లో తెలంగాణ ఎలా మారిందో ప్రజలు ఆలోచించాలని పల్లా కోరారు. వివిధ శాఖలలో లక్షకు పైగా ఉద్యోగాలను..

ఏడేళ్లకు మందు తర్వాత తెలంగాణ ఎలా ఉందో ఆలోచించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Jan 23, 2021 | 11:58 AM

పోరాటాల అడ్డా మహబూబాబాద్ గడ్డా అని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణా ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని అగ్రభాగానా నిలుపుతుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కరోనా వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని చెప్పారు. త్వరలో నిరుద్యోగుల బృతి, తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

2014 ముందు తెలంగాణ ఎలా ఉంది, గడిచిన 7 సంవత్సరాల లో తెలంగాణ ఎలా మారిందో ప్రజలు ఆలోచించాలని పల్లా కోరారు. వివిధ శాఖలలో లక్షకు పైగా ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సారి తనను గెలిపించాలని పల్లా కోరారు. ఈ కార్యక్రమంలో MP మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పట్ట భద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.