Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెరిటేజ్ చంద్రబాబుది కాదు..నాది – మోహన్ బాబు

సినీ నటుడు మోహన్ బాబు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే స్టోరీ ఒకటే తెలుగు ప్రజలకు తెలుసని.. కానీ ఆయన హెరిటేజ్ స్టోరీ ఎవరకి తెలియదని మోహన్ బాబు తెలిపారు. నమ్మిన ఎన్టీఆర్ ను మొదలు.. చాలామందిని చంద్రబాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపణలు చేశారు. టీడీపీ అన్న ఎన్టీఆర్ ది.. […]

హెరిటేజ్ చంద్రబాబుది కాదు..నాది - మోహన్ బాబు
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2019 | 8:02 AM

సినీ నటుడు మోహన్ బాబు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే స్టోరీ ఒకటే తెలుగు ప్రజలకు తెలుసని.. కానీ ఆయన హెరిటేజ్ స్టోరీ ఎవరకి తెలియదని మోహన్ బాబు తెలిపారు. నమ్మిన ఎన్టీఆర్ ను మొదలు.. చాలామందిని చంద్రబాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపణలు చేశారు.

టీడీపీ అన్న ఎన్టీఆర్ ది.. హెరిటేజ్ ఫుడ్స్ తనదని మోహన్ బాబు తెలిపారు. ఆయన తాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ చంద్రబాబుది యూజ్ అండ్ త్రో క్యారెక్టర్. ఎన్టీఆర్ తో  సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. అందులో నేను కూడా ఒకడిని. అసలు హెరిటేజ్ ఫుడ్స్ నాది.. అందులో నాదే ఎక్కువ భాగస్వామ్యం. చంద్రబాబు, నేను, దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్ ఫుడ్స్ ను స్థాపించాం”

హెరిటేజ్ సంస్థలో ప్రధాన పెట్టుబడి నాది, చంద్రబాబుది తక్కువ పెట్టుబడి, దాగా అనే స్నేహితుడిది మరింత తక్కువ పెట్టుబడి. అంతా బాగుందని అనుకునేసరికి కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు బ్లాంక్ పేపర్స్ పంపించి సంతకాలు పెట్టమన్నారు. అప్పుడు నేను బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. ఇక అప్పట్లో నేను సినిమా హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాను. అంతేకాకుండా చాలా బిజీగా ఉండటంతో స్నేహితుడని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశా. అంటే ఇంకేముంది కొన్నేళ్లకు షేర్స్ అన్ని అతని భార్య పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసుకుని హెరిటేజ్ సంస్థతో నాకు సంబంధం లేదని గట్టి షాక్ ఇచ్చాడని పేర్కొన్నారు.

దానితో ఈ విషయం మీద కోర్టుకు వెళ్లా. కేసు చాలా కాలం సాగింది. అయితే చంద్రబాబు పరపతి ఉన్నవాడు.. అతనితో మనకెందుకు అని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశా. ఆ తర్వాత కొద్దిరోజులకు నాలాగే నా స్నేహితుడిని కూడా మోసం చేసి బయటకు పంపారని తెలుసుకున్నాను. అంతేకాదు హెరిటేజ్ సంస్థ విషయంలో బాబు మాతో పాటు రైతులను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు.

ఎన్టీఆర్ ను మోసం చేసి ఎలా పార్టీని తీసుకున్నారో.. నన్ను మోసం చేసి హెరిటేజ్ ను తీసుకున్నారు. ఇది నిజం ఇక ఈ విషయాన్ని తాను ఎక్కడ చెప్పమన్నా చెబుతానని.. చంద్రబాబు తనలా నిజం చెప్పగలడా అని మోహన్ బాబు అన్నారు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే తప్పకుండా జగన్ కు ఓటు వెయ్యాలని ఆయన ఏపీ ప్రజలను కోరారు.