సీఎం రమేష్ ఇంటిపై పోలీసుల దాడులు

కడప: గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల ఇంటి పై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇక తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోట్లదుర్తిలోని ఆయన ఇంటిలోకి 50 మందికి పైగా పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు ఉదయం 6 గంటల నుంచి జరుగుతున్నట్లు సమాచారం. దీనితో సీఎం రమేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు […]

సీఎం రమేష్ ఇంటిపై పోలీసుల దాడులు
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2019 | 8:41 AM

కడప: గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల ఇంటి పై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇక తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోట్లదుర్తిలోని ఆయన ఇంటిలోకి 50 మందికి పైగా పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు ఉదయం 6 గంటల నుంచి జరుగుతున్నట్లు సమాచారం. దీనితో సీఎం రమేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు ఏంటని ప్రశ్నించారు.

ఎస్పీ ఆదేశాల ప్రకారమే తాము సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు ఆయనకు సమాధానం చెప్పినట్లు సమాచారం. ఇకపోతే పోలీసులు మా నేతలనే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని.. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే అని సీఎం రమేష్ ఆరోపించారు. ఇది ఇలా ఉంటే సీఎం రమేష్‌ ఇంట్లో పోలీసులకు ఏమీ లభ్యం కాలేదని సమాచారం. కాగా వైసీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఇటీవలే కడప ఎస్పీని బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు దగ్గరపడడంతో… రాజకీయ పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. అటు పోలీసులు కూడా దాడులకు దిగడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.