MLA Anam: అధికారులపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం.. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణ
ఏపీ అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీరయస్ మోడ్‌లో ఉన్నారు. అధికారులు తమకు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని ఇటీవలి కాలంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే...
MLA Anam: ఏపీ అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీరయస్ మోడ్‌లో ఉన్నారు. అధికారులు తమకు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని ఇటీవలి కాలంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ఆనం రామనారాయణ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో అధికారులపై ఫైర్ అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. జిల్లాలో అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని.. ఎమ్మెల్యేగా తమకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత లేదా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరైనా చెబితే విస్మరించారా..? లేదా వారు కావాలనే నిర్లక్ష్యం చేశారో నిగ్గు తేల్చాలన్నారు. జిల్లా అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ నిబంధనలు అని చెబుతున్నారని.. ఈసీ దృష్టికి తాను ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆనం చెప్పారు. అలాంటి నిబంధనలు లేవని ఈసీ చెప్పినప్పటికీ.. ఈ విధంగా చేయడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని.. చట్టపరంగా పోరాటం చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక మొన్నటికి మొన్న నగరి ఎమ్మెల్యే రోజా సైతం ప్రోటోకాల్ విషయంలో బాగా హర్టయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తనను భాగస్వామిని చేయడం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరి ఈ విషయంపై వైసీపీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read:
Sirkali robbery: తమిళనాడులో రెచ్చిపోయిన దుండగులు.. ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ