ఏపీలో పంచాయతీ ఎన్నికలకు కదిలిన యంత్రాంగం.. వరుస భేటీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ బిజీబిజీ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
AP Local Body Elections : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న ఏపీ పంచాయతీ ఎన్నికల వివాదం.. ఇంకా రగులుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. బదిలీలతో ఎన్నికల కమిషనర్, ఏకగ్రీవాల కోసం సర్కార్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలను సజావుగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తీసుకోవల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ముందుగా.. గవర్నర్, ప్రభుత్వ కార్యదర్శులతో ఎస్ఈసీ వేర్వేరుగా భేటీ అయ్యారు.. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
కొత్తగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల రగడ కొనసాగుతోంది. ఎన్నికలు లేకుండా పెద్ద ఎత్తున ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా సర్కార్ ప్రోత్సహిస్తుండగా.. టీడీపీ దాన్ని తప్పుపడుతోంది. ఇప్పటికే ఏకగ్రీవమైతే ఊరికి 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని సర్కార్ నజరానాలను ప్రకటించింది. పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం.. 2వేల జనాభా ఉంటే 5 లక్షలు, 5వేల జనాభా ఉంటే 10, 10వేల లోపు జనాభా ఉంటే 15 లోలు, 10వేలపైన ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున అందిస్తామని జీవో ఇచ్చింది. టీడీపీ మాత్రం సాధ్యమైనంత వరకు ఎక్కువ నామినేషన్లు వేయించేలా చూడాలని చూస్తోంది.
ఓవైపు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. కొందరు అధికారులపై వేటు వేస్తూనే ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం సహకరించని వారిని బదిలీ చేస్తున్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేస్తూ… ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లోనూ చేర్చాలని ఆదేశించడం సంచలనంగా మారింది. అటు.. నిమ్మగడ్డ ఆదేశాలతో గుంటూరు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్‌కుమార్, చిత్తూరు కలెక్టర్ భరత్‌గుప్తా బదిలీ అయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డిని కూడా సర్కార్ బదిలీ చేసింది. చిత్తూరు కలెక్టర్‌గా అక్కడి జేసీ మార్కండేయులు, గుంటూరు కలెక్టర్‌గా జేసీ దినేశ్‌కుమార్‌లకు అదనపు బాధ్యతలను అప్పగించింది సర్కార్. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు తిరుపతి అర్బన్ బాధ్యతలను ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల కార్యాచరణ స్టార్ట్ కావడంతో.. ఉద్యోగ సంఘాలు కూడా విధుల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయి. అటు.. పంచాయతీ ఎన్నికలను సజావుగా జరిపేలా.. నిఘా పెట్టే బాధ్యతలను పోలీస్‌ట్రైనింగ్ ఐజీ సంజయ్‌కు అప్పగించిన డీజీపీ గౌతం సవాంగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వారంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్టు అదనపు డీజీపీ రవిశంకర్ ప్రకటించారు.
Read Also… బీజేపీ, జనసేన కీలక భేటీ.. తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఉమ్మడి అవగాహన