కేటీఆర్‌ను చర్చకు రమ్మనడానికి ఓ స్థాయి ఉండాలి.. ఎవడు పడితే వాడు గన్‌పార్క్‌కు రమ్మంటే వస్తారా..? -తలసాని

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పీక్‌ స్టేజ్‌కి చేరుతుంది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై..

  • K Sammaiah
  • Publish Date - 6:56 pm, Sat, 27 February 21
కేటీఆర్‌ను చర్చకు రమ్మనడానికి ఓ స్థాయి ఉండాలి.. ఎవడు పడితే వాడు గన్‌పార్క్‌కు రమ్మంటే వస్తారా..? -తలసాని

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పీక్‌ స్టేజ్‌కి చేరుతుంది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా ఆరేళ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాని అధికార పార్టీ లెక్కలు చెబుతుంది ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌, మధ్య ఉద్యోగాల భర్తీ అంశంపై సవాళ్లు విసురుకున్నారు.

అయితే కాంగ్రెస్‌ గన్‌పార్క్‌ వద్ద చేసిన డ్రామా ఆడిందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఫైర్‌ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దని సూచించారు. ఎవడు పడితే వాడు గన్‌పార్క్‌ దగ్గరకు చర్చకు రమ్మంటే మంత్రి కేటీఆర్‌ వస్తారా? అని తలసాని ప్రశ్నించారు. చర్చకు రమ్మని అడగడానికి స్థాయి అంటూ ఉండాలన్నారు. రెండేళ్లుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారు? అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు.

దుబ్బాక సిటింగ్‌ సీటును బీజేపీకి కోల్పోయిన టీఆర్‌ఎస్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిటింగ్‌ సీటు హైదరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడి మూడు జిల్లాల్లోనూ ఉమ్మడి జిల్లాలవారీగా ముగ్గురు మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్‌కు మంత్రి గంగుల కమలాకర్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వేముల ప్రశాంత్‌ రెడ్డిలను ఇన్‌చార్జులుగా సీఎం కేసీఆర్‌ నియమించారు. ఆయా జిల్లాల మంత్రులతో కలిసి వీరు పని చేస్తారు. బూత్‌ స్థాయి వరకూ అందర్నీ సమాయత్తం చేసే బాధ్యతను వీరికి అప్పగించారు.

నిన్న గన్‌పార్క్‌ దగ్గర కాంగ్రెస్‌ శ్రేణులు గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌. ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దమన్న కేటీఆర్ సవాల్ ను స్వీకరించారు. 26న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గర చర్చకు రెడీ అన్నారు శ్రవణ్. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి కూడా భర్తీ చేసినట్లు చూపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్న కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డారు దాసోజు శ్రవణ్ .

అయితే అన్న మాట ప్రకారమే గన్‌పార్క్‌ దగ్గరకు వచ్చారు కాంగ్రెస్‌ నేతలు. KTR కోసం పేరు రాసి మరీ ఓ కుర్చీ వేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు… పెద్దయెత్తున అక్కడకు చేరుకున్నారు. లక్షా 32 వేల 799 ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్‌ సవాల్‌పై చర్చకు సిద్ధమయ్యారు కాంగ్రెస్‌ నేతలు. గన్‌పార్క్‌ వద్ద ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేటీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు. ఉద్యోగాలను కల్పించామని అబద్దం చెబుతున్నారని… ప్రగతి భవన్ లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

మీ కోసమేనా యువత బలిదానాలు చేసుకున్నదని… నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకు నిద్రపోలేదని.. లక్ష 32 వేల ఉద్యోగాలు.. ఇచ్చాం అని ఎట్ల చెబుతారని నిలదీశారు. అవినీతి సొమ్ముతో.. ఓట్లు కొనడానికి సిద్ధంగా వున్నారా… కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలి పెట్టబోదని హెచ్చరించారు. మొత్తానికి తాజాగా మంత్రి తలసాని వ్యాఖ్యలతో రాజకీయంగా కాక రేగుతుంది. మరి తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఎలా స్పందిస్తారోననే అంశం ఆసక్తిగా మారింది

Read more:

జీడీపీకి అసలు ఫుల్ ఫాం ఏంటి..? మంత్రి కేటీఆర్‌ ట్వీట్ కు నెటిజన్ల అదిరిపోయే సమాధానాలు