తెలంగాణ తొలితరం ఉద్యమ కారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవికి మంత్రి కేటీఆర్‌ వైద్య సాయం.. ఉద్యమకారుల హర్షం

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి కి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పది లక్షల రూపాయలను..

తెలంగాణ తొలితరం ఉద్యమ కారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవికి మంత్రి కేటీఆర్‌ వైద్య సాయం.. ఉద్యమకారుల హర్షం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 27, 2021 | 6:36 PM

తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి కి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , డా. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఆరోగ్యం విషమంగా ఉందని, ఓ ప్రైవేట్ దవాఖాన లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

డా. చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలను ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇదే రోజున తమ తండ్రి పుట్టినరోజు కావడం, ఇదే రోజున ఆపదలో ఉన్న తమను మంత్రి కేటీఆర్ ఆదుకోవడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు.

డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఈరోజు పత్రికల్లో వార్త ప్రచురితమైంది. కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థిగా తోటి విద్యార్థులను కూడగట్టి 1969, ‘జై తెలంగాణ’ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ తన గొంతుక వినిపించారు. విద్యార్థిదశ నుంచి సామాజిక ఉద్యమాల్లో బలమైన గొంతుకగా నిలిచిన డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాదపడుతున్న చిరంజీవి ఈ నెల19న గచ్చిబౌలిలోని ఒక ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స అందిస్తున్నట్లు చిరంజీవి కూతురు అజిత తెలిపారు.

మా నాన్న చికిత్స కోసం రోజుకు రూ.లక్ష దాకా ఖర్చవుతోంది. ఇప్పటి వరకు సుమారు రూ. పది లక్షలైంది. మరో రూ. పది లక్షలు అవసరమవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మా నాన్నను కాపాడుకోవడం కోసం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాం. మా నాన్న పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్దమనసుతో స్పందిస్తుందని ఆశిస్తున్నాం. మా నాన్న చికిత్సకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రభుత్వ పెద్దలను విన్నవిస్తున్నాను’’ అని డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి కూతురు అజిత కన్నీటిపర్యంతమయ్యారు.

పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే పది లక్షల రూపాయల సాయం అందించడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more:

జీడీపీకి అసలు ఫుల్ ఫాం ఏంటి..? మంత్రి కేటీఆర్‌ ట్వీట్ కు నెటిజన్ల అదిరిపోయే సమాధానాలు

బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్