ఇందుకేనా..? నువ్వు రావాలి.. కావాలి.. అంటున్నారు: లోకేష్

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన ట్విట్టర్‌ ద్వారా వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. క్రిస్టియన్‌పేట బూత్ వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను. కానీ.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆర్కే, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని […]

ఇందుకేనా..? నువ్వు రావాలి.. కావాలి.. అంటున్నారు: లోకేష్
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 11:11 AM

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన ట్విట్టర్‌ ద్వారా వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. క్రిస్టియన్‌పేట బూత్ వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను. కానీ.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆర్కే, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వైసీపీ ఒత్తిడితో ఎన్నికల కమిషన్ ఓటుపై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక అభ్యర్థిగా ప్రజలకు ఓటు హక్కు కల్పించాలని నిరసన తెలిపాను. ముందుగా ప్లాన్ చేసుకున్న ఒక ఛానెల్ సిబ్బంది, వైసీపీ గూంఢాలు నాపై దాడి చేశారని లోకేష్ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను నరికేశారు. తాడేపల్లి క్రిష్టియన్ పేటలో నాపై దాడికి దిగారు.. ఇందుకేనా..? నువ్వు రావాలి.. నువ్వు కావాలి అంటున్నారు మీ రౌడీలు, గూంఢాలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.