విజయవాడ ప్రసాదంపాడులో తీవ్ర ఉద్రిక్తత
ఎన్నికల వేళ విజయవాడ శివారులోని ప్రసాదంపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ సీఐ మహిళా ఓటరు పట్ల దురుసుగా మాట్లాడారంటూ ఓటర్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం ఈవీఎంలు మొరాయించిన కారణంగా దాదాపు 500 మంది ఓటర్లు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. అక్కడికి చేరుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరితగతిన పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులను కోరారు. […]

ఎన్నికల వేళ విజయవాడ శివారులోని ప్రసాదంపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ సీఐ మహిళా ఓటరు పట్ల దురుసుగా మాట్లాడారంటూ ఓటర్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం ఈవీఎంలు మొరాయించిన కారణంగా దాదాపు 500 మంది ఓటర్లు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. అక్కడికి చేరుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరితగతిన పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు నలుగురు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. విధుల్లో ఉన్న సీఐ అక్కడ ఉన్న మహిళా ఓటరు పట్ల దురుసుగా ప్రవర్తించారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో పోలీసులు అతిగా స్పందిస్తున్నారంటూ వంశీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ సమయంలోనే వైకాపా అభ్యర్థి, ఆయన అనుచరులు అక్కడే ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం తోపులాటలు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ హర్షవర్దన్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సీఐ తనతో మాట్లాడాలని, అప్పటివరకు తాను పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లేది లేదని వల్లభనేని భీష్మించుకుకూర్చున్నారు. తాను దుర్భాషలాడలేదని సీఐ చెప్పినా.. ఎమ్మెల్యే శాంతించకుండా ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం విజయవాడ – ఏలూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



