Minister Malla Reddy: యాదాద్రిలో ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఛాలెంజ్
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ దొంగరెడ్డి అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి మల్లా రెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తిడతాడా అంటూ..
మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) , పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy)మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో గరం అయ్యారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ దొంగరెడ్డి అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి మల్లా రెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తిడతాడా అంటూ ఫైరయ్యారు. తెలంగాణ మహాత్ముడు కేసీఆర్.. తెలంగాణ ఫ్యూచర్ కేటీఆర్ అంటూ ప్రశంసించారు. గెలవలేని పార్టీకి రైతు డిక్లరేషన్ ఏంటని ప్రశ్నించారు మల్లారెడ్డి. విదేశాల్లో పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ వెళ్తుంటే.. రాహుల్ గాంధీ పార్టీలు, పబ్బులకు వెళ్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అన్నారు మల్లారెడ్డి. గతంలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ని ఖతం చేస్తారన్నారని జోస్యం చెప్పారు.
రేవంత్‌ది అంతా బ్లాక్ మెయిల్ పని.. 10, 15 ఏళ్ల నుంచి పార్టీలు మారడమే పనిగా పెట్టుకున్నారని..రేపు బీజేపీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను వేధించాడన్నారు మల్లా రెడ్డి. తన సీటుకే ఎసరు పెట్టేంతవరకు వచ్చాడని.. అప్పుడు చంద్రబాబు ముందు ఆయన కథ బయటపెట్టానన్నారు.
రేవంత్ జీవితం మొత్తం బ్లాక్‌మెయిలింగే అని మల్లారెడ్డి విమర్శించారు. బ్లాక్‌మెయిల్ చేయకపోతే ఆయనకి నిద్రపట్టదన్నారు. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి తన డబ్బులతోనే చేశారన్నారు మంత్రి మల్లారెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిపై ప్రమాణం చేసి చెప్పాలన్నారు.
పీసీసీ చీఫ్ పదవిని కూడా డబ్బులిచ్చి కొన్నాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మల్లారెడ్డి. రేవంత్‌కు ఇంత ఆస్థి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణలపై గరం అయ్యారు మంత్రి మల్లారెడ్డి. ఆయనో దొంగరెడ్డి అని.. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాషే అన్నారు.
అసలు రేవంత్ ఏమన్నారంటే..
అయితే.. అంతకు ముందు మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అక్రమాలకు పాల్పడుతున్న మల్లారెడ్డిని జైలులో వేస్తామని హెచ్చరించారు. మల్లారెడ్డి అక్రమాలపై ఏడీబీ, విజిలెన్స్ విచారణజరుపుతామన్నారు. మల్లారెడ్డి.. ఆయన అల్లుడి కలిసి చేస్తున్న అక్రమాలపై కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశిస్తామన్నారు. అవసరమైతే జైలులో కూడా వేస్తామన్నారు.