పథకాల క్లాష్..కేసీఆర్..మోదీ ..ఎవరు బెస్ట్ ?

ప్రధాని మోదీకే  మళ్ళీ పట్టం అంటూ ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇవ్వడంతో.. తెలంగాణాలో కొంత అయోమయం నెలకొంటోంది. తెరాస సర్కార్ అమలు చేస్తున్న పథకాలతో కేంద్ర పథకాలు కొన్ని ‘ ట్యాలీ ‘ అవుతున్న నేపథ్యంలో..ఈ గందరగోళం తలెత్తింది. ఉదాహరణకు కేంద్రం (మోదీ ) ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. ఇది కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం లాంటిదే.  కేసీఆర్ ఫ్లాగ్ షిప్ కిట్ ప్రోగ్రామ్ కూడా మోదీ  ప్రభుత్వ పథకమైన ‘ […]

పథకాల క్లాష్..కేసీఆర్..మోదీ ..ఎవరు బెస్ట్ ?
Follow us

|

Updated on: May 22, 2019 | 12:13 PM

ప్రధాని మోదీకే  మళ్ళీ పట్టం అంటూ ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇవ్వడంతో.. తెలంగాణాలో కొంత అయోమయం నెలకొంటోంది. తెరాస సర్కార్ అమలు చేస్తున్న పథకాలతో కేంద్ర పథకాలు కొన్ని ‘ ట్యాలీ ‘ అవుతున్న నేపథ్యంలో..ఈ గందరగోళం తలెత్తింది. ఉదాహరణకు కేంద్రం (మోదీ ) ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. ఇది కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం లాంటిదే.  కేసీఆర్ ఫ్లాగ్ షిప్ కిట్ ప్రోగ్రామ్ కూడా మోదీ  ప్రభుత్వ పథకమైన ‘ ప్రధానమంత్రి మాతృవందన యోజన వంటిదే. గర్భిణి కి అమ్మాయి పుడితే పదమూడు వేలు, అబ్బాయి పుడితే పన్నెండు వేలు ఇవ్వాలన్నది  కేసీఆర్ ఉద్దేశమైతే.. ఇదే కేంద్ర పథకం కింద గర్భిణికి అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా ఆరు వేలు ఇస్తున్నారు. ఈ రెండు పథకాలూ రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. తన పథకాన్ని కేంద్ర పథకంలో విలీనం చేసేందుకు కేసీఆర్ అంగీకరించడంలేదు. పైగా రెండూ విలీనమైతే తెలంగాణ షేర్ తగ్గుతుందని కేంద్రం చేస్తున్న వాదనతో ఆయన విభేదిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య,  మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇటీవల హైదరాబాద్ కు వఛ్చి.. ప్రధానమంత్రి మాతృవందన పథకం కింద లబ్దిదారులను వేరుగా గుర్తించాలని ఇక్కడి అధికారులను కోరినట్టు తెలిసింది. కానీ ఇందుకు తెలంగాణ సర్కార్ ఒప్పుకోలేదు. కేంద్రం ఈ పథకం కింద సుమారు రెండున్నర వేల కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్ ప్రభుత్వం సుమారు అయిదు వందల కోట్లు ఖర్చు చేసింది. ఇలాగే.. రైతు బంధు పథకాన్ని కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి వేరు చేసి చూసేందుకు తెలంగాణ  సర్కార్ కసరత్తు చేసింది..

Latest Articles