అసెంబ్లీ ఛాన్స్ మిస్.. లోక్‌సభ సస్పెన్స్

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఊహించని దాని కంటే ఎక్కువ సీట్లనే సొంతం చేసుకొని, రెండోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో పేరు మోసిన నాయకులు సైతం ఓడిపోయారు. అయితే వారిలో కొంతమంది తాజాగా జరిగిన లోక్‌సభ బరిలో నిలిచారు. మరి ఈ ఎన్నికల్లోనైనా వారు గెలుస్తారా..? అన్న విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి: […]

అసెంబ్లీ ఛాన్స్ మిస్.. లోక్‌సభ సస్పెన్స్
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 12:45 PM

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఊహించని దాని కంటే ఎక్కువ సీట్లనే సొంతం చేసుకొని, రెండోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో పేరు మోసిన నాయకులు సైతం ఓడిపోయారు. అయితే వారిలో కొంతమంది తాజాగా జరిగిన లోక్‌సభ బరిలో నిలిచారు. మరి ఈ ఎన్నికల్లోనైనా వారు గెలుస్తారా..? అన్న విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

రేవంత్ రెడ్డి: కొడంగల్‌లో ఓటమి ఎరగని నాయకుడిగా పేరొందిన రేవంత్ రెడ్డికి.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్‌ను ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేసిన రేవంత్‌కు.. సొంత నియోజకవర్గంలో మొదటిసారి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎంపీగా మల్కాజ్‌గిరి నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు రేవంత్. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని లోక్‌సభలో అడుగుపెట్టగానే ప్రైవేట్ బిల్లను పెడతానంటూ ప్రముఖంగా హామీ ఇచ్చి అందర్నీ ఆలోచింపజేశారు రేవంత్. మరి ఎంపీగా రేవంత్ గెలుస్తారో..? లేదో..? అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.

కిషన్ రెడ్డి: తెలంగాణ బీజేపీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన కిషన్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికలు మొండిచేయి చూపాయి. అంబర్‌పేట్ నుంచి ఆయన ఓడిపోయారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో పోటీ చేశారు కిషన్ రెడ్డి. ఇక్కడ ఆయన గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఆయనకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

రామచంద్రరావు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ముఖ్య నేతలలో రామచంద్రరావు ఒకరు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసిన ఆయన అక్కడి నుంచి ఓడిపోయారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా బరిలో ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారో..? లేదో..? చూడాలి.

ఫిరోజ్ ఖాన్: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం హవాకు అడ్డుకట్ట వేసేలా కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్‌ను బరిలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాంపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. గెలుపు కోసం చెమటోడ్చారు. దీంతో ఆయన మజ్లిస్ జోరుకు అడ్డుకట్ట వేయగలా..? అంటూ అందరూ ఆసక్తిగా అటువైపు చూస్తున్నారు.