AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Meat: పాము మాంసానికి ఇక్కడ యమ డిమాండ్.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

ప్రపంచంలో రకరకాల సంస్కృతులు ఉన్నట్లు వారి ఆహార అలవాట్లు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని దేశాల్లో పాము మాంసం తినే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ మాంసం వారి ఆహారంలో ఒక భాగం మాత్రమే కాదు, ఔషధంగా, టానిక్‌గా కూడా పరిగణిస్తుంటారు. ఈ దేశాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Jan 02, 2026 | 1:02 PM

Share
చైనాలో, ముఖ్యంగా దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో పాము మాంసంకి అధిక డిమాండ్‌ ఉంటుంది. పాము సూప్ ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందిన శీతాకాలపు వంటకం. ఈ సూప్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చైనీయుల నమ్మకం.

1 / 5
వియత్నాంలో పాము మాంసాన్ని రుచికరమైన ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు. ఇక్కడ పాము మాంసాన్ని వేయించి, కాల్చి సూప్‌లో ఉపయోగిస్తారు. అలాగే పాము రక్తాన్ని, దాని గుండెని 'రైస్ వైన్'తో కలిపి తాగడం ఈ దేశంలో చాలా గొప్ప క్రేజ్ గా భావిస్తారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందట.

2 / 5
థాయిలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము మాంసాన్ని తెగ తింటారు. దీనిని ప్రధానంగా పాము కూర లేదా 'స్టిర్-ఫ్రై' వంటకాలుగా తయారు చేస్తారు. విదేశీయులకు ఇది కొన్ని రెస్టారెంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

3 / 5
ఇండోనేషియాలో పాము మాంసాన్ని ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, ఉబ్బసం చికిత్సకు కోబ్రా (నాగుపాము) పాము మాంసం, దాని రక్తాన్ని ఉపయోగిస్తారు. జకార్తా వంటి నగరాల్లో పాము మాంసంతో కబాబ్‌లు తయారు చేసి అమ్ముతారు.

4 / 5
అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా టెక్సాస్, ఫ్లోరిడాలో 'రాటిల్‌స్నేక్స్' తినే సంప్రదాయం ఉంది. ఇక్కడ చాలా ప్రదేశాలు 'రాటిల్‌స్నేక్ రౌండప్స్' అనే పండుగలను జరుపుకుంటాయి. ఇక్కడ పాము మాంసాన్ని వేయించి చిరుతిండిగా తింటారు.

5 / 5