బ్లాక్‌సాల్ట్‌తో బంపర్ బెనిఫిట్స్..
22 January 2026
Jyothi Gadda
వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలు సాధారణమైనవే. కానీ వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. నల్ల ఉప్పు కూడా అలాంటిదే.
బ్లాక్ సాల్ట్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఆహారం రుచిని పెంచడమే కాదు, అనేక అనారోగ్య సమస్యలు నయం చేస్తుంది.
నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో నల్ల ఉప్పు మంచి పనితీరును కనబరుస్తుంది.
బ్లాక్ సాల్ట్ కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాలలో కూడా తేలింది. కడుపు నొప్పిని శాంతపరచడానికి ఇది పనిచేస్తుంది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చిటికెడు నల్ల ఉప్పు చాలా మేలు చేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభమా నష్టమా ?
ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు.. ఆ వ్యాధులకు వణుకే..!
కొబ్బరి పాలతో కోటి లాభాలు..!