వామ్మో.. సోయాబీన్స్ వారికి మాత్రం విషంతో సమానమా..?
Prasanna Yadla
22 January 2026
Pic credit - Pixabay
ఒక కప్పు ఉడకబెట్టిన సోయా బీన్స్ తీసుకుంటే 5.1 గ్రామ్స్ ఫైబర్ మీకు లభిస్తుంది. మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ ఇచ్చే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది సోయానే అని నిపుణులు కూడా చెబుతున్నారు.
సోయా బీన్స్
ఇంకా చెప్పాలంటే ఈ సోయాను మాంసాహారంతో పోల్చితే పోషకాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ , సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పోషకాలు
జిమ్ కి వెళ్లే వాళ్ళలో చాలా మంది సోయా ను ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుందని కానీ, దానిని మితి మీరి తీసుకోవడం వలన ఆరోగ్యానికి నష్టమని చెబుతున్నారు
ఆరోగ్యానికి నష్టం
ఎందుకంటే, వీటిని రోజూ తినడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ చేరి కిడ్నీ లో రాళ్ళు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి, వారంలో రెండు సార్లు మాత్రమే తీసుకోండి.
కిడ్నీ లో రాళ్ళు
సోయా బీన్స్ పోషకాల పుట్ట అని అందరికీ తెలుసు. అలా అని వీటిని మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా, మహిళలు అధికంగా తీసుకోకండి.
అనారోగ్య సమస్యలు
అదే పనిగా రోజూ తీసుకుంటే కడుపు ఉబ్బర సమస్యలు వస్తాయి. అంతే కాదు విపరీతమైన విరోచనాలు కూడా అవుతాయి. కడుపులో గ్యాస్ తో పాటు నొప్పి కూడా మొదలవుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా వీటిని తినకపోవడమే మంచిది.
కడుపు ఉబ్బరం
సోయా బీన్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు రోజూ తీసుకుంటే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలు
బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకుంటే ఇంకా పెరుగుతారు. అధిక బరువు ఉన్న వారు వీటిని తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఇంకా చెప్పాలంటే అసలు వీటిని దూరం పెడితే ఇంకా మంచిది.
అధిక బరువు
థైరాయిడ్ తో ఇబ్బంది పడే వారు సోయాబీన్స్ ను మర్చిపోతేనే బెటర్. ఎందుకంటే దీనికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది.ఇంకా చెప్పాలంటే అయోడిన్ లోపం ఉన్నవారు దీనిని తీసుకోకండి.