చాణక్య నీతి : తెలియకుండానే స్త్రీలకు పరుషులు పెట్టే  మానసిక పరీక్షలివే!

Samatha

2 January 2026

ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు, తెలివైన వ్యక్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడే కాదు, మానవ స్వభావం గురించి లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి.

అందుకే చాణక్యుడు తన జీవితకాలంలో మానవాళి సంక్షేమం కోసం ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

చాణక్యుడు, బంధాలు బంధుత్వాలు, స్త్రీ , పురుషుల సంబంధం ఇలా ఎన్నో అంశాల గురించి తెలియజేశాడు. అదే విధంగా ఆయన భర్తలు భార్యలకు పెట్టే మానసిక పరీక్షల గురించి కూడా తెలియజేయడం జరిగింది.

కావాలనే పురుషుడు చిన్న చిన్న విషయాలకు వాదిస్తూ, తన భార్య సహనాన్ని పరీక్షిస్తాడంట. కోపంలో తన భార్య ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటాడు.

అదే విధంగా ఎలాంటి కష్టం లేకపోయినా, ఏదో కష్టంలో పడినట్లు నటించి, తన భార్య తనకు అండగా, ఉంటుందో లేదో గమనిస్తాడంట.

అలాగే పురుషుడు తన ఆర్థిక పరిస్థితి గురించి అబద్ధం చెప్పడం, దీని వలన తన భార్య తనపై ప్రేమతో ఉందో, డబ్బు వ్యామోహమూ తెలుసుకుంటాడంట.

అదే విధంగా తాను బయటకు వెళ్లినప్పుడు, ఇతరులతో తన భార్య ఎలా మాట్లాడుతుందో కూడా నిశితంగా గమనిస్తారంట.

అలాగే త్యాగ గుణం ఉందా లేదా? ఇతరులకు అన్నం పెట్టే గుణం ఉందా లేదా? అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తుందో లేదో కూడా తెలుసుకుంటుందంట.