‘నాకు అన్యాయం జరిగింది’, సుప్రీంకోర్టుకెక్కిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్,

తనకు అన్యాయం జరిగిందని అంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సుప్రీంకోర్టుకెక్కారు.  మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

'నాకు అన్యాయం జరిగింది', సుప్రీంకోర్టుకెక్కిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్  పరమ్ బీర్ సింగ్,
Param Bir Singh Moves Sc Seeking Probe Against Anil Deshmukh
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2021 | 5:17 PM

తనకు అన్యాయం జరిగిందని అంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సుప్రీంకోర్టుకెక్కారు.  మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. అలాగే తనను హోంగార్డ్స్ శాఖకు బదిలీ చేయడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై ఇంకా ఎలాంటి కఠిన చర్య తీసుకోకుండా తనకు రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరారు. ఈ నెల 17 న ఆయనను ప్రభుత్వం సీపీ పదవి నుంచి హోమ్ గార్డ్స్ శాఖకు డీజీగా బదిలీ చేసింది. మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ని హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన కార్యాలయానికి  పిలిపించుకుని నగరంలోని బార్లు,   రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ప్రతి నెలా రూ..100 కోట్లను వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని అంటూ ఆయన సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో బాంబ్ కేసుకు సంబంధించి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.  మాన్ సుఖ్ హీరేన్ మృతి కేసును కూడా దీనికి అధికారులు జోడించారు.

ఇలా ఉండగా హో ఓ వీడియో మెసేజ్ లో ఆయన.. వాజేతో బాటు పోలీసు అధికారులను తాను పిలిపించుకుని ఆదేశాలిచ్చినట్టు చేసిన ఆరోపణ పూర్తిగా నిరాధారమన్నారు. కరోనా వైరస్ కి గురైన తను ఫిబ్రవరి 15 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాయనని, అప్పటి నుంచి 27 వరకు హోమ్ క్వారంటైన్  లో ఉన్నానని చెప్పారు. అలాంటిది పోలీసు అధికారులతో తాను ఎలా మీట్ అవుతానని ప్రశ్నించారు. మొదటిసారిగా గత నెల 28 న తను తన ఇంటి నుంచి బయటకు వచ్చానన్నారు. అటు.. అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్  స్పష్టం చేశారు. పరమ్ బీర్ సింగ్ తనను హోమ్ గార్డ్స్ విభాగానికి బదిలీ చేశారన్న ఆగ్రహం తోనే అనిల్ పై ఈ ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: National Film Awards 2020 Winners List: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’..ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’

Sainik School Job Notification 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగావకాశాలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే