ప్రెసిడెంట్‌ని త్వరగా ఎన్నుకోండి..లేదంటే ఇబ్బందులే: శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరుండాలో త్వరగా ఎన్నుకోవాలని..లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ హెచ్చరించారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కొత్త ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం  కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకవచ్చారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ఆ వ్యాఖ్యలను శశిథరూర్ సమర్ధించారు. చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలోనే […]

ప్రెసిడెంట్‌ని త్వరగా ఎన్నుకోండి..లేదంటే ఇబ్బందులే: శశిథరూర్
Follow us

|

Updated on: Jul 30, 2019 | 2:06 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరుండాలో త్వరగా ఎన్నుకోవాలని..లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ హెచ్చరించారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కొత్త ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం  కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకవచ్చారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ఆ వ్యాఖ్యలను శశిథరూర్ సమర్ధించారు.

చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలోనే ఉన్న ప్రియాంకా గాంధీ 2019 ఫిబ్రవరిలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలయ్యారు. తూర్పు యూపీ బాధ్యతలు కూడా ఆమెకు కట్టబెట్టారు. ప్రియాంకా గాంధీకి ఉన్న ఛరిష్మా పనికొస్తుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని శశిథరూర్ అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో.. నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామా మీద పార్టీ  సీడబ్ల్యూసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికే మరోసారి అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలి. పార్టీలో కొందరు నేతలు మాత్రం సోనియాగాంధీకి మళ్లీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం యువతకు చాన్స్ ఇవ్వాలంటున్నారు.