AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలింగ్‌ సమీపిస్తుండటంతో కాక రేపుతున్న ప్రచారం.. కార్యకర్తల సమావేశంలో వీహెచ్ సంచలన కామెంట్స్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల ప్రచారం..

పోలింగ్‌ సమీపిస్తుండటంతో కాక రేపుతున్న ప్రచారం.. కార్యకర్తల సమావేశంలో వీహెచ్ సంచలన కామెంట్స్
K Sammaiah
|

Updated on: Mar 09, 2021 | 1:25 PM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల ప్రచారం కాకపుట్టిస్తోంది. పరస్పర సవాళ్లతో ప్రధాన పార్టీల నాయకులు విరుచుకుపడుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్న ముఖ్యనేతలు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూసుకుపోతున్నాయి. ముఖ్య నేతల పర్యటనలతో ప్రచారం జోరందుకుంటోంది. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఒకసారి ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని రంగారెడ్డి-మహబూబ్​నగర్-హైదరాబాద్ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇక బీజేపీ సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ అభ్యర్థి రాంచందర్​రావు ఉద్యోగాల లెక్కల విషయంలో టీఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసుగు చెంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ విజయం కోసం కాంగ్రెస్​ పార్టీ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సమావేశమై మార్గనిర్దేశనం చేశారు. ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయన్న ఉత్తమ్.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెరాస, భాజపాలకు పట్టభద్ర ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

టి ఆర్ ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం కలుగలేదని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా అంబర్ పెట్ లోని వి. హనుమంతరావు నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో నిరుద్యోగులను,పి ఆర్ సి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను టి ఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పట్టభద్రుల కు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు.కాబట్టి మేధావులు మార్చ్ 14 న జరిగే ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ను కాంగ్రేస్ పార్టీ కి వేసి గెలిపించాలని కోరారు.గెలిచిన మరుక్షేనం అన్ని సమస్యలపై పోరాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు.

Read More:

ఏప్రిల్‌ 1న గో మహాగర్జన.. కామారెడ్డికి చేరుకున్న యుగతులసి ఫౌండేషన్‌ ప్రచార రథం..

జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌.. బీజేపీపైకి ఎమ్మెల్సీ కవిత వదిలిన బాణం.. మల్లును ముల్లుతోనే తీసే యత్నం

కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం.. మహిళా దినోత్సవం వేడుకల్లో ఆ పాటతో శాసనసభాపతి భావోద్వేగం