రాజ్‌భవన్‌కు చేరుకున్న బీజేపీ నేతలు.. కాసేపట్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇరు పార్టీల భేటీ

బీజేపీ తరపున సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, దుర్గేష్ రాజ్‌భవన్‌కు..

రాజ్‌భవన్‌కు చేరుకున్న బీజేపీ నేతలు.. కాసేపట్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇరు పార్టీల భేటీ
Follow us
K Sammaiah

|

Updated on: Jan 28, 2021 | 12:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కావాలని ఆ రాష్ట్ర బీజేపీ, జనసేన నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఆ రెండు పార్టీల నేతలు రాజభవన్‌కు‌ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్‌తో నేతలు భేటీ కానున్నారు.

బీజేపీ తరపున సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, దుర్గేష్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించాలని, ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌కు నేతలు విజ్ఞప్తి చేయనున్నారు.

అలాగే 2019 ఓటరు లిస్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే 3 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని గవర్నర్‌కు తెలపనున్నారు. పంచాయతీలు ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం బలవంతంగా ఇతర అభ్యర్థులను నామినేషన్‌ ఉపసంహరించుకునే విధంగా బెదిరిపులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఆ విషయంపై దృష్టి సారించాలని కోరనున్నారు.

విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్, ఇప్పటివరకూ తలెత్తిన కరోనా ఇబ్బందులకు జగన్ బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్న

Salaar: ప్రభాస్ సరసన శృతి హాసన్.. అధికారికంగా ప్ర‌క‌టించిన ‘స‌లార్’ చిత్ర బృందం