తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా.. ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..

Telangana Employees: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య లెక్క తేలింది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా.. ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..
Follow us
uppula Raju

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 8:49 AM

Telangana Employees: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య లెక్క తేలింది. 32 శాఖలు, వాటి కింద పనిచేస్తున్న అనుబంధ విభాగాల నుంచి వివరాలను సేకరించిన పీఆర్సీ చివరకు 4,91,304 శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయని గుర్తించింది. ఈ నివేదిక రూపొందించే సమయానికి (2020 డిసెంబరు) 3,00,178 మంది పనిచేస్తున్నారని, ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. అత్యధికంగా విద్యాశాఖలో 1.37 లక్షలు, ఆ తర్వాత హోంశాఖలో 98,394 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 52,906 పోస్టులు ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

ఈ మూడు శాఖలతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు, వాటికింద ఉన్న అనుబంధ విభాగాలలోని శాంక్షన్డ్ పోస్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటే సుమారు 70 % (69.80%) ఈ ఐదు శాఖలలోనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద శాంక్షన్డ్ పోస్టులలో 61% మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 39% ఖాళీలే. అత్యధిక ఉద్యోగులు కలిగిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నాలుగవ స్థానంలో ఉంది. అత్యధికంగా పంజాబ్‌లో 1.77%, మహారాష్ట్రలో 1.69% మంది, తమిళనాడులో 1.66% చొప్పున ఉన్నారు. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. అతి తక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఆరు కోట్లకుపైగా జనాభా ఉంటే కేవలం 1.85 లక్షల శాంక్షన్డ్ పోస్టులు మాత్రమే (0.31%) ఉన్నాయి.

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..