Hyderabad Airport: హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు రూ.2,190 కోట్ల సేకరణ: జీఎంఆర్‌

Hyderabad Airport: జీఎంఆర్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)ను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు..

Hyderabad Airport: హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు రూ.2,190 కోట్ల సేకరణ: జీఎంఆర్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2021 | 5:43 AM

Hyderabad Airport: జీఎంఆర్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)ను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల్లో 30 కోట్ల డాలర్లు (సుమారు 2,190 కోట్లు) అంతర్జాతీయ మార్కెట్‌లో రుణ పత్రాలు జారీ చేయడం ద్వారా సేకరించనుంది. అయితే ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ రుణ పత్రాలను 4.75 శాతం వడ్డీ రేటుతో తీసుకునేందుకు మదుపరులు అంగీకరించారు. ఇది జీఎంఆర్‌ గ్రూప్‌పైనా, జీహెచ్‌ఐఏఎల్‌ పరపతి సామర్థ్యంపై మదుపరుల నమ్మకానికి గుర్తని జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎంఆర్‌ గ్రూపు నిర్వహణలో రాజీవ్‌ గాంధీ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌ పోర్టు ద్వారా గత ఏడాది 2.1 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ఈ విస్తరణలో భాగంగా ప్రయాణికుల రాకపోకల వార్షిక సామర్థ్యాన్నిఆ 3.4 కోట్లకు పెంచారు. విస్తరణలో భాగంగా ప్రయాణికుల రాకపోకల వార్షిక సామర్ధ్యాన్ని 3.4 కోట్లకు పెంచాలని జీఎంఆర్‌ గ్రూపు నిర్ణయించింది.

Also Read:

Smart Railway Services: ఏపీలో స్మార్ట్‌గా రైల్వే సేవలు.. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీసు మార్కెట్ల ఏర్పాటు

Budget 2021: ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం