హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

నిజాం కాలం నాటి నుంచి భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్ బస్సులు తిరిగేవన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని మరోసారి పునరుద్ధరించేందుకు ఆర్టీసీ..

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
Double Decker Buses
Follow us

|

Updated on: Jan 28, 2021 | 7:31 AM

నిజాం కాలం నాటి నుంచి భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్ బస్సులు తిరిగేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అవి కాలక్రమేణా కనుమరుగయ్యాయి. ఇప్పుడు వాటిని మరోసారి పునరుద్దరించేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నగరంలోని ప్రముఖ కట్టడాలను వీక్షించేలా నగరవాసుల అవసరాలకు అనుగుణంగా బస్సుల రూపురేఖలను మారుస్తున్నట్లు తెలుస్తోంది. 50లోపు బస్సులను అన్ని ప్రధాన రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ సిద్దమవుతోందట. (Double Decker Buses Hyderabad)

దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే నివేదికను రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే కోఠి-పటాన్‌చెరువు, మెహిదీపట్నం-సికింద్రాబాద్ రూట్లలో ఈ బస్సులను నడిపించే అవకాశాలపై అధికారులు పరిశీలిన చేస్తున్నారు. కాగా, బస్సుల సంఖ్య, ఆదాయ వ్యయాలు, ఇతర అంశాలపై ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించామని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

”అమ్మో వీళ్ల పిచ్చి మాములుగా లేదుగా”.. రుయాకు మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు.!

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..

Breaking: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. థియేటర్లలో సీట్ల సామర్ధ్యంపై కీలక నిర్ణయం