”అమ్మో వీళ్ల పిచ్చి మాములుగా లేదుగా”.. రుయాకు మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు.!
Madanapalle Incident: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన పద్మజ, పురుషోత్తం నాయుడును మదనపల్లె సబ్ జైలు నుంచి..

Madanapalle Incident: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన పద్మజ, పురుషోత్తం నాయుడును మదనపల్లె సబ్ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించారు. వారిద్దరూ డెల్యూషన్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గవర్నమెంట్ సైకియాట్రిస్టు రాధిక ధృవీకరించడంతో.. ఆమె సూచనల మేరకు నిందితులిద్దరిని న్యాయమూర్తి అనుమతితో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తామని మదనపల్లె సబ్ జైల్ సూపరిండెంట్ రామకృష్ణ నాయక్ తెలిపారు.
అటు రాత్రంతా జైల్లో పద్మజ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అలాగే నిందితులు ఇద్దరూ నిన్నటి నుంచి ఆహారం తీసుకోలేదని అధికారులు తెలిపారు. కాగా, నిన్న ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు తీసుకెళ్లగా.. అక్కడ పద్మజ.. ”నేను శివుడిని.. ఇతడు నా భర్త కాదు” అని పురుషోత్తం నాయుడిని తోసేసిన సంగతి తెలిసిందే.
Also Read:
మదనపల్లె మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!
”నేనే శివుడిని.. నాకు కరోనా రావడమేంటి” తల్లి పద్మజ వింత చేష్టలు.. 32 గంటల్లోనే మారిన సీన్..