Sirkali robbery: తమిళనాడులో రెచ్చిపోయిన దుండగులు.. ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..

Sirkali robbery: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మయిళదుతురాయ్ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో నివసించే ధన్‌రాజ్(50).. బంగారం వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఓ నలుగురు దుండగులు అతడి ఇంట్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ధన్‌రాజ్ భార్య ఆశ(42), అతని కుమారుడు అఖిల్(24)ను హత్య చేసి 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని తెలిపారు. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను కూడా నిందితులు తీసుకువెళ్లారని వివరించారు.
స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను నార్త్ ఇండియన్స్‌గా గుర్తించారు.
Also Read:
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి… పురుగుల మందు తాగి ఆత్మహత్య